Chandrayaan-3 : స్మైల్ ప్లీజ్.. విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ట్వీట్

ఇస్రో ట్వీట్ ప్రకారం.. బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ ను రోవర్ ఫొటో తీసింది. రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి.

Chandrayaan-3 : స్మైల్ ప్లీజ్.. విక్రమ్ ల్యాండర్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ట్వీట్

Chandrayaan-3

Updated On : August 30, 2023 / 3:17 PM IST

Chandrayaan-3 Mission: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన ల్యాండర్, రోవర్ తమ పనిలో నిమగమ్నమయ్యాయి. అయితే, బుధవారం ఇస్రో ఆసక్తికర ట్వీట్ చేసింది. బుధవారం ఉదయం రోవర్ ల్యాండర్ ఫొటోలను తీసింది. ఆ ఫొటోలను ట్వీట్ చేసిన ఇస్రో.. ‘స్మైల్ ఫ్లీజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Chandrayaan 3: ఇస్రో సంచలనం.. జాబిల్లిపై ఉన్న మూలకాలను గుర్తించిన రోవర్

ఇస్రో ట్వీట్ ప్రకారం.. బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ ను రోవర్ ఫొటో తీసింది. రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి. అలాగే నావిగేషన్ కెమెరాలను ఎలక్ట్రో – ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇదిలాఉంటే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పలు మూలకాల మిశ్రమాలను గుర్తించింది. మూలకాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌లో లేజర్-ఇండ్యుసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS) పరికరాన్ని అమర్చిన విషయం తెలిసిందే.

Chandrayaan 3: జాబిల్లిపై అటు చైనా రోవర్ కదలికలు.. ఇటు భారత రోవర్.. ఏం జరుగుతోంది?

ఎల్ఐబీఎస్ పేలోడ్ ను బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్‌లో అభివృద్ధి చేశారు. దక్షిణ ధ్రువంపై ఎల్ఐబీఎస్ మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన చేసిందని ఇస్రో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో సల్ఫర్ ఉన్నట్లు తేల్చిందని ఇస్రో పేర్కొంది. ఎల్ఐబీఎస్ శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా మూలకాలను విశ్లేషిస్తుందని ఇస్రో తెలిపింది.

ప్రాథమిక విశ్లేషణ చేసి పలు అంశాలను నిర్థారించామని పేర్కొంది. దాని ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti) ఉన్నట్లు తేల్చామని ఇస్రో తెలిపింది. అలాగే, మరికొన్ని గణాంకాల ద్వారా మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O) ఉనికి ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం హైడ్రోజన్ ఉనికి గురించి పరిశోధన జరుగుతోందని చెప్పింది.