Chandrayaan-3 : చంద్రయాన్‌-3 మిషన్‌లో గద్వాల యువకుడు .. పేలోడ్స్‌లో సేవలందించిన కృష్ణ

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు కూడా చంద్రయాన్- 3 మిషన్‌ కోసం సేవలందించాడు.

Chandrayaan-3 : చంద్రయాన్‌-3 మిషన్‌లో గద్వాల యువకుడు .. పేలోడ్స్‌లో సేవలందించిన కృష్ణ

Gadwal Youth Chandrayaan 3 Design

Updated On : August 24, 2023 / 11:26 AM IST

Chandrayaan-3 Telangana  Krishna Kammari : ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిని ముద్దాడింది. ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అత్యంత తక్కువ ఖర్చుతోనే భారత్ ఈ విజయాన్ని అందుకుంది. చంద్రయాన్ -3 విజయంతో యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది. చంద్రయాన్3 విజయంతో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయం కోసం నిద్రాహారాలు మాని మరీ పనిచేశారు మన శాస్త్రవేత్తలు. వారితో పాటు సాంకేతిక విభాగాల్లో ఎంతోమంది పనిచేశారు. ఈ చంద్రయాన్ -3 మిషన్ లో తెలంగాణకు చెందిన యువకుడు కూడా పాల్గొనటం గమనించాల్సిన విషయం. ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 మిషన్‌లో.. తెలంగాణకు చెందిన యువకుడు కూడా ఉండటం గర్వకారణమనే చెప్పాలి.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు కూడా చంద్రయాన్- 3 మిషన్‌ కోసం సేవలందించాడు. పేద కుటుంబంలోపుట్టినా కృష్ణ ఇస్రోలో ఉద్యోగం సంపాదించారు. చంద్రయాన్-3 మిషన్ లో పేలోడ్స్ కు పనిచేసిన ఐదుగురు సభ్యుల్లో గద్వాల యువకుడు కృష్ణ కూడా ఒకరు. కుమ్మరి మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కృష్ణ. 2018లో ఐసీఆర్‌బీ నిర్వహించిన పరీక్షలో 4వ ర్యాంక్‌ సాధించి బెంగళూర్‌లో ఇస్రో లివోస్‌ విభాగంలో గ్రూప్‌-ఏ గెజిటేడ్‌ అధికారిగా కృష్ణ బాధ్యతలు చేపట్టాడు. సాఫ్ట్‌వేర్‌ సైంటిస్ట్‌ ఎస్‌డీ‌గా ఉన్న కృష్ణ.. చంద్రయాన్‌-3 మిషన్‌లో 2 పెలోడ్స్‌ (ఎల్‌ఎచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కు డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించటం విశేషం.

Chandrayaan-3 : ‘సైకిల్ నుంచి చందమామ దాకా’ చంద్రయాన్ -3 సక్సెస్ వేళ .. వైరల్ అవుతున్న ఫోటో

లక్ష్యమనేది నిర్ధేశించుకుంటే సాధించలేనిది ఏమీ లేదని..పేదరికం చదువుకు అడ్డురాదని నిరూపించాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన కృష్ణ. కృష్ణ తల్లిదండ్రులు నిరుపేదలు. రోజువారీ రోజు వారి కూలీలు. ఉండవెల్లి ప్రభుత్వ స్కూల్లోనే చదివిని చంద్రయాన్ మిషన్ లో పనిచేసే స్థాయికి తన కృష్టి, పట్టుదలతో ఎదిగాడు. తన ప్రతిభా పాటవాలతో ఇస్రోలో ఉద్యోగం సంపాదించటమే కాకుండా యావత్ భారతం గర్వించేలా చేసిన చంద్రయాన్ -3 మిషన్ లో భాగస్వామి అయ్యాడు.