Chandrayaan-3 : ‘సైకిల్ నుంచి చందమామ దాకా’ చంద్రయాన్ -3 సక్సెస్ వేళ .. వైరల్ అవుతున్న ఫోటో

భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్-3తో సాధించిన ఈ అత్యంద్భుతమైన ఘనత సాధించిన ఈ శుభ తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. 

Chandrayaan-3 : ‘సైకిల్ నుంచి చందమామ దాకా’ చంద్రయాన్ -3 సక్సెస్ వేళ .. వైరల్ అవుతున్న ఫోటో

cycle se chand tak photo

Chandrayaan-3 cycle se chand tak photo : చంద్రుడిని మామా అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటాం. భారతీయులు మాత్రమే ఇలా చంద్రుడ్ని ‘మామా’ అంటూ ఏదో సొంత మేనమామను పిలిచినంత చనువుగా..ఆత్మీయంగా పిలుచుకుంటుంటారు. అందుకేనేమో ప్రపంచంలోనే ఏ దేశం సాధించని ఘతన చంద్రయాన్-3తో భారత్ సాధించింది. బహుశా చంద్రుడికి కూడా భారత్ అంటే ఇష్టమే ఏమో..సాంకేతికంగా దూసుకుపోతున్నాయనే చెప్పుకునే దేశాలకు కూడా అందని ఘనతను భారత్ కు దక్కించి ఉంటాడు మన చందమామ.

భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్-3తో సాధించిన ఈ అత్యంద్భుతమైన ఘనత సాధించిన ఈ శుభ తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.  ఓ రాకెట్ విడిభాగాలను సైకిల్ పై మోసుకెళుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. చంద్రయాన్ -3 సక్సెస్ అయిన వేళ ‘సైకిల్ సే చాంద్ తక్’! అంటే సైకిల్ నుంచి చందమామ దాకా’’ అనే క్యాప్షన్ తో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అంటే సైకిల్ పై రాకెట్ ను మోసుకెళ్లే స్థాయి నుంచి చంద్రయాన్ -3 సక్సెస్ వరకు అనే అర్థాన్ని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది.ఈ ఫోటో చెబుతున్న విషయం కూడా అదే అనటంలో ఏమాత్రం సందేహంలేదు.

కాగా..ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకున్న తొలి దేశం భారత్ గా నిలిచింది. ఇటీవల రష్యా కూడా kp. 1600 కోట్ల ఖర్చుతో తయారు చేసిన ‘లూనా-25’ మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువానికి పంపింది. కానీ ల్యాండింగ్‌కు ముందే క్రాష్ అయింది. కానీ భారతదేశం మిషన్ ఇప్పుడు కేవలం 615 కోట్ల రూపాయలతో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడానికి ఏకైక మిషన్ గా నిలిచింది.

యావత్ ప్రపంచం చంద్రయాన్ -3మీదనే దృష్టి సాధించింది. భారత్ ఎంత వరకు సక్సెస్ సాధిస్తుంది అనేదానికి భారత్ ధీటైన సమాధానం చెప్పింది ఈ సక్సెస్ తో. కేవలం భారతే కాదు యావత్ ప్రపంచం చంద్రయాన్ -3 పైనే దృష్టి పెట్టింది. అలా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన చంద్రయాన్ -3 సక్సెస్ అయ్యింది. బుధవారం (ఆగస్టు 23,2023)సాయత్రం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది. దీంతో భారతదేశం సంబరాల్లో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు, ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

గతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు రాకెట్ భాగాలను సైకిల్ పై మోసుకెళ్తున్న ఫొటో ఆ పక్కనే చంద్రయాన్ -3 ఫోటో కలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనే అర్థం సుస్పష్టంగా ఈ ఫోటోలో కనిపిస్తోంది. చంద్రయాన్ -3 సక్సెస్ అయినప్పటినుంచి ఈ ఫొటో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్ లో సర్క్యూలేట్ అయ్యింది. అవుతోంది కూడా. ఇది మన శాస్త్రవేత్తల కృష్టికి, అంకిత భావానికి ప్రతీకంగా నిలుస్తోంది. రాకెట్ విడిభాగాలను నాడు సైకిల్ పై మోసుకెళ్లిన ఇస్రో.. నేడు రష్యా వంటి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసిందని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒకప్పుడు సైకిల్ తోనే ఇస్రో ప్రయాణం మొదలు పెట్టినా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి పోటీ ఇస్తోంది భారత్.

తిరువనంతపురంలోని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కు ఇద్దరు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ముక్కు భాగాన్ని (ముందు భాగాన్ని) సైకిల్ పై మోసుకెళ్తున్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫోటోకు ‘సైకిల్ సే చాంద్ తక్’! అంటే సైకిల్ నుంచి చందమామ దాకా అనే క్యాప్షన్ పెట్టారు. ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించారు.