Chandrayaan-3: ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి ఎలా దిగిందో మీరూ చూడండి ..

ఇస్రో తాజాగా ట్విటర్లో షేర్ చేసిన వీడియోకు .. ’చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.

Chandrayaan-3: ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి ఎలా దిగిందో మీరూ చూడండి ..

Chandrayaan-3 mission

Updated On : August 25, 2023 / 1:23 PM IST

Chandrayaan-3 Mission: చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్రో పంపించిన చంద్రయాన్-3లో ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ తన పనిలో నిమగ్నమైంది. చంద్రయాన్-3 ప్రయోగం నాటినుంచి ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తున్న ఇస్రో.. శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలం మీద అడుగు పెడుతున్న దృశ్యాలను ఇస్రో షేర్ చేసిన వీడియోలో మనం చూడొచ్చు.

ISRO Team celebrations : చంద్రయాన్ 3 సక్సెస్‌తో స్టెప్పులేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ అండ్ టీం

ఇస్రో తాజాగా ట్విటర్లో షేర్ చేసిన వీడియోకు .. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. రోవర్ తన అన్వేషణను మొదలు పెట్టింది. చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, వాతావరణం, భూకంప కార్యకలాపాలపై ప్రాథమికంగా అధ్యయనం చేస్తుందని చెప్పారు.

Chandryaan-3 :చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌వాక్‌ ప్రారంభం…ఇస్రో ల్యాండర్ ఇమేజర్ కెమెరా చిత్రాల విడుదల

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 7గంటలకు పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించనున్నారు.