ISRO Team celebrations : చంద్రయాన్ 3 సక్సెస్‌తో స్టెప్పులేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ అండ్ టీం
చంద్రయాన్ 3 విజయవంతమైన వేళ ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషంలో మునిగిపోయారు. చైర్మన్ సోమనాథ్ సహా శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది ఆనందంతో స్టెప్పులు వేశారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ISRO Team celebrations
ISRO Team celebrations : నాలుగు సంవత్సరాల క్రితం చెదిరిన కల.. ఎలాగైనా సాకారం చేసుకోవాలని అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూలై 14 న చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది. దీనిపై పట్టుదలగా దృష్టి పెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలు డ్యాన్సులు చేశారు.
Salary of ISRO Chairman : ఇస్రో చైర్మన్ సోమనాథ్ జీతం ఎంతో తెలుసా.. అలవెన్స్‌లు అన్నీ కలిపి ఎంతంటే?
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తి చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో కాలు మోపిన తొలి దేశం కూడా భారత్ కావడం విశేషం. బుధవారం సాయంత్రం సరిగ్గా 5.47 నిముషాలకు మొదలైన ల్యాండింగ్ ప్రక్రియ 15 నిముషాల్లో విజయవంతంగా పూర్తైంది.
ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ
చంద్రయాన్ 1 ప్రయోగం 2008 లో నిర్వహించారు. అప్పటి నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తానికి 15 సంవత్సరాల తర్వాత ఆ కల సాకారం అయ్యింది. ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు తీవ్ర ఉత్కంఠలో మునిగిపోయారు. 140 కోట్ల భారతీయుల కలల్ని నిజం చేస్తూ సరిగ్గా 6.03 నిముషాలకు ల్యాండర్ చంద్రునిపై కాలు మోపింది. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఇస్త్రో శాస్త్రవేత్తలకు అందరూ శుభాకాంక్షలు చెప్పారు. చంద్రయాన్ 3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ సోమనాథ్ సహా, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా కనిపించారు. డ్యాన్సులు చేసి సందడి చేసారు. శాస్త్రవేత్తలు డ్యాన్సులు చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
❤️
Team ISRO celebrating #Chandrayaan3 ! pic.twitter.com/XVtjzbUiWl
— Neha Joshi (@The_NehaJoshi) August 24, 2023