Chandrayaan-3: చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తిచేసిందట.. అవేమిటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏమన్నారంటే

చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని అందులో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ చేరుకోవడం వీడియో కనిపిస్తుంది.

Chandrayaan-3: చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తిచేసిందట.. అవేమిటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏమన్నారంటే

Chandrayaan-3 Mission

Updated On : August 27, 2023 / 8:30 AM IST

Chandrayaan-3 Mission: చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి  ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతం అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా ల్యాండింగ్ అయింది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రునిపై నడుస్తూ డేటాను సేకరిస్తోంది. రోవర్ ప్రతి కదలికపై ఇస్రో ఓ కన్నేసి ఉంచుతోంది. వచ్చే రెండు వారాలపాటు ఈ ప్రక్రియను తమ బృందం పర్యవేక్షిస్తుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్, రోవర్ అన్నీ పనిచేస్తున్నాయి. అంతా సక్రమంగా జరుగుతుందని, రాబోయే 14 రోజులు మేము డేటాను అధ్యయనం చేస్తూనే ఉంటామని ఇస్రో చీఫ్ తెలిపారు.

Chandrayaan-3: ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి ఎలా దిగిందో మీరూ చూడండి ..

ఇదిలాఉంటే చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండు లక్ష్యాలను పూర్తిచేసినట్లు ఇస్రో తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ మూడు లక్ష్యాల్లో మొదటిది.. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్ పూర్తిచేసింది. రెండోది చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ను విజయవంతంగా నడిపినట్లు ఇస్రో పేర్కొంది. ఇక మూడో లక్ష్యం.. శాస్త్రీయ పరిశోధనల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ల్యాండర్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.

Chandrayaan-3 Success : చంద్రయాన్-3 విజయంపై ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్‌ల ప్రశంసలు

చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని అందులో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ చేరుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఇదిలాఉంటే చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై స్టాప్ట్ ల్యాండింగ్ ద్వారా ఇస్రో చరిత్ర సృష్టించింది. తొలిదేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో కేంద్రంకువెళ్లి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు.