Jayaprakash Narayana: నా బ్యాంక్ అకౌంట్ లో 8లక్షలు కొట్టేశారు- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జయప్రకాశ్ నారాయణ

టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. నేరస్తులు మనకంటే తెలివిగల వాళ్లు.

Jayaprakash Narayana: నా బ్యాంక్ అకౌంట్ లో 8లక్షలు కొట్టేశారు- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జయప్రకాశ్ నారాయణ

Updated On : November 9, 2025 / 10:44 PM IST

Jayaprakash Narayana: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా సైబర్ బాధితులే. మీ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ పోయింది. ఏం చేద్దాం.. దీనికి ఎండ్ కార్డ్ ఎలా? అన్న ప్రశ్నకు ఆయన ఏమని సమాధానం ఇచ్చారంటే..

”ఒకప్పుడు మనకు చాలా కష్టంగా ఉండేది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. ఇప్పుడేమో ప్రపంచంలో మనం ఛాంపియన్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో నెంబర్ వన్. సామాన్యులు కూడా కూరగాయలు అమ్మే వ్యక్తి నుంచి చివరకు భిక్షకులు కూడా క్యూఆర్ కోడ్ కలిగి ఉంటున్నారు. టెక్నాలజీ ఆ రకంగా ఉండటం మంచిదే. కానీ, అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరాల బారిన పడతాం. కొందరు ఇదే ఉద్యోగం పెట్టుకున్న వాళ్లు ఉన్నారు. నేను అలా నష్టపోయిన వాడినే.

కోవిడ్ టైమ్ లో డెల్టా వేవ్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ లాక్ డౌన్ వచ్చింది. ఆ సమయంలో నా ఫోన్ పని చేయడం మానేసింది. బయటకు వెళ్లడం కూడా కష్టమే. నెల రోజులు గడిచాయి. ఆ తర్వాత నాకు డబ్బు అవసరమై చెక్ పంపించా. బ్యాంకులో నా ఖాతాలో 7, 8 లక్షలు ఉన్నాయని నాకు తెలుసు. నా తమ్ముడు నాకు డబ్బు పంపాడు. డబ్బులు డ్రా చేద్దామని చెక్ పంపిస్తే.. నా ఖాతాలో డబ్బులు లేవని బ్యాంకు వాళ్లు అన్నారు. డబ్బు ఏమైంది అని ఆరా తీస్తే.. అప్పుడు తెలిసింది. ప్రతిరోజు 10వేల నుంచి 20వేల వరకు డ్రా చేశారు.

ఫోన్ లేకపోయే సరికి నాకు తెలియదు. మెసేజ్ లు రాలేదు. ఈ అనుభవం నాకు రెండు అంశాలు నేర్పింది. ఆర్బీఐ గవర్నర్ తోనూ మాట్లాడా. టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. నేరస్తులు మనకంటే తెలివిగల వాళ్లు. మయన్మార్ బోర్డర్ లో భయంకరమైన స్థాయిలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఏడాదికి 500 బిలియన్ డాలర్లు అని చెబుతున్నారు.

సైబర్ నేరాలను ఆపే శక్తి ఎవరికీ లేదు. యూపీఐ ట్రాన్సాక్షన్లు ఆపేస్తే ఆర్థిక వ్యవస్థకు నష్టం. అలా చేయడానికి బదులుగా ఇన్సూరెన్స్ పెట్టండి. ఒక సామాన్య కస్టమర్ కు 10లక్షలు పోతే అది ప్రాణాంతకం. ఒక బ్యాంక్ కి 10 కోట్లు పోయినా ప్రాణాంతకం కాదు. మీ డబ్బు పోతే పోయింది నాకేం సంబంధం మీ కర్మ అని బ్యాంకర్ వదిలేయకూడదు. ఇది చాలా అన్యాయం. వెంటనే ఆ డబ్బును భర్తీ చేయాలి” అని జయప్రకాశ్ నారాయణ అన్నారు.

Also Read: తెలుగు నేల చూసిన అతి గొప్ప సీఎం ఆయనే- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జయప్రకాశ్ నారాయణ..