attack
Dalit Man Wedding Baraat : దేశంలో దళితులపై దాడులు కొనసాగుతూనేవున్నాయి. మధ్యప్రదేశ్ లోని షజాపూర్ జిల్లాలో దళితుడి పెళ్లి బరాత్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దళిత యువకుడు అనిల్ చంద్ర పెళ్లి బరాత్ శుక్రవారం భాందెడి గ్రామ నుండి వెళ్తుంతోంది. ఈ క్రమంలో డీజే మ్యూజిక్ ఆపాలంటూ కొంతమంది పెళ్లి బరాత్ పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
మరో ఘటనలో శివపూరి జిల్లా వర్ఖాడి గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది ఇద్దరు దళితులపై దాడి చేశారు. జూన్ 22న రేవా జిల్లాలో ఇంద్రజీత్ మాజీ అనే వ్యక్తి మెడలో చెప్పుల దండవేసి దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Delhi Metro Train : ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య
దొంగతనం చేశాడన్న అనుమానంతో మాజీని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.