కశ్మీర్ జ్రాదీపోరాలో రాళ్ల దాడి: ట్రక్ డ్రైవర్ మృతి 

  • Publish Date - August 26, 2019 / 06:21 AM IST

దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం  రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్‌హాల్ భీజ్‌భేరా ప్రాంత నివాసి డ్రైవర్‌ నూర్‌ మహ్మద్‌ దార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నూర్ మహ్మద్ ను పోలీసులు వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్రం తరలించారు. తీవ్ర గాయాలతో నూర్  చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

డ్రైవర్ పై రాళ్ల దాడికి పాల్పడ్డవారిని పోలీసులు చెదరగొట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా అదుపులోకి తీసుకున్న ఇద్దరిపై గతంలో కూడా ఎటువంటి కేసులు లేనట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ట్రక్కు డ్రైవర్ ను టార్గెట్ గా ఈ దాడి జరగలేదనీ..ఓ సెక్యూరిటీకి వాహనాన్ని టార్గెట్ గా చేసిన రాళ్ల దాడిలో అనుకోకుండా డ్రైవర్ నూర్ కు గాయాలైనట్లుగా  పోలీసుల విచారణలో తేలింది. కాగా.. శ్రీనగర్‌లో గత కొద్ది రోజుల క్రితం..ఆందోళనకారులు రాళ్ల దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే.

కాగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచీ..పలు ఘర్షణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆందోళన కారులు…రాళ్లదాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో అమాయకులు బలైపోతున్నారు. ఈ క్రమంలో ఆందోళన కారులను అణచివేసేందుకు ప్రభుత్వం కశ్మీర్ లోయలో సైన్యాన్ని భారీగా మోహరింపజేసింది. ఈ క్రమంలో సమావేశాలను నిషేధించే నిషేధ ఉత్తర్వులు ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి.