Karnataka
Karnataka : భార్యాభర్తలు అవసాన దశలో ఒకరికి ఒకరు తోడు-నీడగా ఉండాలని కోరుకుంటారు. చిత్త వైకల్యంతో బాధపడుతున్న 92 సంవత్సరాల తన భర్తతో తనకు కలిసి జీవించాలని ఉందని 80 ఏళ్ల వృద్దురాలు కోర్టు మెట్లెక్కింది. అందుకు కొడుకు అడ్డుపడ్డాడు. ఈ విషయంలో కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటే?
Viral Video : జోరుగా .. హుషారుగా మోనోసైకిల్ నడుపుతున్న పెద్దాయన.. ఎక్కడంటే?
కేరళకు చెందిన ఓ వృద్ధ జంట కేసు ఆసక్తికరంగా మారింది. 92 సంవత్సరాల పెద్దాయన చిత్త వైకల్యంతో బాధపడుతుంటే కొడుకు ఇంట్లోనే నిర్బంధించాడు. ఎవరినీ కలవనీయకుండా చేసాడు. దీంతో అతనికి దూరంగా ఉంటున్న అతని భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. తనకు తన భర్తతో కలిసి జీవించాలని ఉందని కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్తకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తనతో బాగానే ఉండేవాడని.. తాను అతనిని చూసుకుంటానని తన వద్దకు పంపించేలా న్యాయం చేయమని కోర్టుకు విన్నవించుకుంది.
Dating App : డేటింగ్ యాప్ బాగా వాడేస్తున్న వృద్ధులు .. మాకూ ప్రేమ కావాలంటున్న బామ్మలు, తాతయ్యలు
ఈ కేసులో కేరళ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రన్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. ఆ వృద్దురాలు తన భర్తను కలవవచ్చని తీర్పు ఇచ్చింది. ఆ పెద్దాయనను నిర్బంధించడం తప్పని వెల్లడించింది. కేరళ నెయ్యట్టింకరలో ఉంటున్న వృద్దురాలి ఇంటికి తన భర్తను తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పును అడ్డుకునేందుకు కొడుకు ప్రయత్నం చేసాడు. తండ్రిని బయటకు వదిలితే అందరితో మాటలు పడాల్సి వస్తోందని ఓ పిటిషన్ వేసాడు. అంతేకాదు తండ్రి మెయింటెన్స్ ఖర్చులకు డబ్బు కావాలని.. తల్లికి పెద్దది కావడంతో తండ్రిని చూసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. వీటన్నింటినీ కొట్టిపారేసిన బెంచ్ వారిద్దరూ కలిసి ఉండవచ్చని తీర్పు ఇచ్చింది.