Dating App : డేటింగ్ యాప్ బాగా వాడేస్తున్న వృద్ధులు .. మాకూ ప్రేమ కావాలంటున్న బామ్మలు, తాతయ్యలు
డేటింగ్ యాప్ కేవలం యువతీ యువకులే కాదు వృద్ధులు కూడా బాగా వాడేస్తున్నారట. డేటింగ్ యాప్ ను వృద్ధులు కూడా వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

Senior dating app
Dating app used by senior citizens : డేటింగ్ యాప్…ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఈ యాప్ ద్వారా యువతీ యువకులు పరిచయాలు ప్రేమలు బ్రేకప్ లు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కానీ డేటింగ్ యాప్ కేవలం యువతీ యువకులే కాదు వృద్ధులు కూడా బాగా వాడేస్తున్నారట. డేటింగ్ యాప్ ను వృద్ధులు కూడా వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. QuackQuack సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వయస్సుతో సంబంధం లేకుండా డేటింగ్ యాప్ ను వినియోగిస్తున్నట్లుగా పరిస్థితులు మారాయని ఈ సర్వే వెల్లడించింది. వృద్ధులు ప్రేమను పొందటానికి మూస పద్ధతులను వీడి కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారని..ఇక్కడే వృద్దులు ప్రేమ కంటే ఇతరుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారని వెల్లడించింది.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్తుంది QuackQuack డేటింగ్ యాప్ సర్వే. మెట్రో, స్మాలర్ సిటిస్ కు చెందిన 50-68 ఏళ్ల వయసున్న 6,000 మందిపై నిర్వహించిన సర్వేలో.. రిటైర్మెంట్ తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ ను ఒంటరిగా గడపకుండా కొత్త పార్ట్ నర్ కోసం డేటింగ్ యాప్స్ ను వినియోగిస్తున్నారని తెలిసింది. కొంతమంది తమ జీవిత భాగస్వామి చనిపోయాక..లేదా విడిపోయాక అలాగే ఉండిపోకుండా స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తున్నారని.. ప్రేమ, రొమాన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిపారు.
Tea : టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
తమ జీవితంలో ట్రూ హార్ట్ బ్రేక్స్ అనుభవించిన వారు..పరిస్థితుల కారణంగా తమ ప్రేమను వదులుకున్నవారు ఇలా రకరకాల పరిస్థితులకు గురైనవారు తిరిగి ఆ ప్రేమను పొందటానికి లేదా ఒకరి సాంగత్యం కోసం డేటింగ్ యాప్ లను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఏదో జీవించాంలే అనుకున్నవారు కూడా ఇప్పుడైనా మంచి ఫీలింగ్ ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పటికైనా కంఫర్టబుల్ కంపెనియన్ షిప్ కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యాప్ ల ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుంటున్నారు.
దీన్ని బట్టి చూస్తే ఈ డేటింగ్ యాప్ డిజైన్ అనేది కేవలం యువత కోసమే కాదు ప్రేమ కోరుకునేవారి కోసం అని కూడా రుజువు చేస్తోంది. అసలైన ప్రేమ,కుటుంబం, స్నేహితులు కనుగొనటానికి ఇలా డేటింగ్ యాప్ లను వినియోగిస్తున్నట్లుగా ఈ సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. నిజమైన ప్రేమను కనుగొనేందుకు వయసుతో సంబంధం లేదని చెప్తున్నారు.
Persons Neck : మెడ పొడవును బట్టి వారు ఎలాంటివారో చెప్పొచ్చట..!
వయస్సు ఓ సంఖ్య మాత్రమే అని ఎంతోమంది నిరూపించారు. వృద్ధాప్యంలో కూడా ప్రేమ చాలా అవసరం.తమకోసం కొంతమంది ఉన్నారనే భావన వృద్ధులకు మరింత ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మానసిక ధైర్యం..మానసిక ప్రశాంతత శరీరానికి చాలా ముఖ్యమని చెబుతుంటారు. వృద్ధాప్యం వచ్చినంత మాత్రాన అన్ని వదులుకోవాల్సిన పనిలేదు. తమకంటూ మలిసంధ్యలో మరో జీవితం ఉందని భావించే వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఏది ఏమైనా ఈ డేటింగ్ యాప్ కేవలం యూత్ కోసమే కాదు వృద్ధులు కూడా అని తెలుస్తోంది.