Foot Amputated Representative Image (Image Credit To Original Source)
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు కోసం ఓ విద్యార్థి చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. తన కాలు తనే నరుక్కున్నాడు. pwd కోటాలో మెడికల్ సీటు కోసం ఆ విద్యార్థి చేసిన పని తెలిశాక అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కింద వైద్య ప్రవేశాలకు దివ్యాంగులకు సంబంధించిన రాయితీలు పొందేందుకు 24 ఏళ్ల విద్యార్థి తన కాలులో కొంత భాగాన్ని నరుక్కున్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. నీట్ పరీక్షలో రెండుసార్లు ఫెయిల్ అయిన విద్యార్థి.. దివ్యాంగుల కోటాలో సులభంగా మెడికల్ సీటు వస్తుందని భావించి తన కాలును నరుకున్నాడు. ఆ తర్వాత దాడిలో కాలుని కోల్పోయినట్లు నాటకాలు ఆడాడు. అయితే, పోలీసులు విచారణలో దిమ్మతిరిగే నిజం బయటపడింది.
ఆ విద్యార్థిని లైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలీపూర్ నివాసి సూరజ్ భాస్కర్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జనవరి 18న జరిగింది. తనపై దాడి జరిగినట్లు, తన కాలుని కోల్పోయినట్లు అతడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. షాకింగ్ నిజం బయటపడింది. జనవరి 23న అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భాస్కర్ దివ్యాంగ్ (వైకల్యం ఉన్న వ్యక్తి-PwD) సర్టిఫికెట్ పొందడానికి తన పాదం భాగాన్ని తనే కత్తిరించుకున్నాడు. భాస్కర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm) పూర్తి చేశాడని, MBBS అభ్యసించడానికి NEET కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు తెలిపారు.
తనపై దుండగులు దాడి చేశారని, తన కాలుని నరికేశారని సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు హత్యాయత్నం అభియోగంపై FIR నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జనవరి 18 ఆదివారం మధ్యాహ్నం సమయంలో సూరజ్ పై దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాడి జరిగిన మరుసటి రోజు ఉదయం తాను స్పృహలోకి వచ్చేసరికి తన ఎడమ పాదం తెగిపోయిందని, మడమ మాత్రమే మిగిలి ఉందని సూరజ్ పేర్కొన్నాడు.
సూరజ్ వాంగ్మూలం, లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే, దర్యాప్తు సమయంలో సూరజ్ ఒక్కోసారి ఒక్కోలా చెప్పడంలో పోలీసులకు అనుమానం వచ్చింది. సూరజ్ తన వాంగ్మూలాన్ని పదే పదే మారుస్తూ తమను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు. అతడి ప్రవర్తన పోలీసుల్లో అనుమానాన్ని మరింత పెంచింది. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా, సూరజ్ కాల్ వివరాల రికార్డులను పోలీసులు పరిశీలించారు. అతడి లవర్ గురించి పోలీసులకు సమాచారం తెలిసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. సూరజ్ బండారం బయటపడింది. ఈసారి ఎలాగైనా మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా సూరజ్ పెట్టుకున్నాడని ఆమె ద్వారా తెలిసింది.
పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయగా.. సూరజ్ నిజం కక్కేశాడు. తనపై ఏ దాడి జరగలేదని, దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు కోసం తన కాలుని తానే తీసేసుకున్నానని వివరించాడు.
”ఆయుధంతో పాదాన్ని నరికివేశారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. చాలా నీట్ గా పాదం కట్ చేసినట్లుగా ఉంది. తన పాదాన్ని తొలగించేందుకు సూరజ్ డు ఒక యంత్రాన్ని ఉపయోగించాడు. బాధితుడికి ఫార్మసీలో డిగ్రీ ఉండటం వల్ల అతనికి ఇంజెక్షన్లు ఎలా ఇవ్వాలో తెలుసు. నొప్పి రాకుండా ఉండేందుకు మొదట తనకు తానుగా అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకుని, ఆపై తన పాదాన్ని కత్తిరించుకున్నాడు. సూరజ్ కాలుని ఎవరో నరికేసినట్లుగా ఎటువంటి ఆనవాళ్లు లేవని డాక్టర్లు సైతం నిర్ధారించారు. నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గర తనపై దాడి జరిగినట్లు బాధితుడు చెప్పాడు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి శోధించారు. తెగిపోయిన పాదం దొరకలేదు. అయితే, అక్కడ కొన్ని ఇంజెక్షన్లు కనిపించాయి. అవి అనస్థీషియాకు సంబంధించినవి కావచ్చు” అని పోలీసులు వెల్లడించారు.
Also Read: చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన వృద్ధురాలు.. 3 సార్లు చనిపోయి బతికిందట..
उत्तर प्रदेश के जौनपुर (Jaunpur) से एक ऐसी खबर आई है जिसे सुनकर आपकी रूह कांप जाएगी। NEET 2026 की तैयारी कर रहे छात्र सूरज भास्कर ने एमबीबीएस (MBBS) में एडमिशन पाने के लिए एक आत्मघाती कदम उठाया।
सूरज ने दिव्यांग कोटा (PWD Quota) हासिल करने के चक्कर में धारदार हथियार से अपने ही… pic.twitter.com/3yl3QZqpVW— News Watch India (@NewsWatch_Ind) January 23, 2026