Gujarat
Gujarat : గుజరాత్‌లో బీపర్ జోయ్ తుఫాను తీరం దాటాకా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం నీటితో నిండిన రైల్వే కల్వర్టులో కాలేజీ బస్సు ఇరుక్కుపోయింది. విద్యార్ధులు బస్సు విండో నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
NIA charge sheets : గుజరాత్ మీదుగా డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్..13మంది పాకిస్థానీలపై ఎన్ఐఏ చార్జిషీట్
గుజరాత్‌లోని కచ్ తీరం ఖజౌ సమీపంలో బీపర్ జోయ్ తుఫాను తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. తుఫాను బీభత్సం కారణంగా అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, ఇళ్లు దెబ్బ తిన్నాయి. చెట్లు నేల కూలాయి. ఇదిలా ఉంటే మరోవైపు అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. నదియాడ్‌లో భారీ వర్షం కారణంగా బస్సు నీట మునిగిన రైల్వే కల్వర్టులో చిక్కుకుపోయింది. బస్సు కిటికీల ద్వారా విద్యార్ధులు ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది.