Chandrayaan-3: భారతీయుల ఆశల్ని నింగిలోకి మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. చంద్రయాన్-3 సక్సెస్!

చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు

Satish Dhawan: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‭డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.

Mumbai police : రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళపై హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించారు. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3 తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్ తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగిస్తారు.

Minister KTR: తెలంగాణలో అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందన్‌వల్లి ఎదగనుంది.. అవసరమైతే జపాన్ కంపెనీలకోసం ఒక క్లస్టర్‌ని‌ ఏర్పాటు చేస్తాం

ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించారు.

Geetha Arts : గీతా ఆర్ట్స్‌కు షాక్ ఇస్తున్న ఆ నిర్మాణ సంస్థలు.. టాలీవుడ్ లో ఏం జరుగుతుంది?

చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6వేల కిలో మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. నాలుగు ఇంజన్ల ససాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.