Mumbai police : రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళపై హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు

ఒకోసారి పోలీసులు పెట్టే విచిత్రమైన కేసులు షాక్ అయ్యేలా చేస్తాయి. తాజాగా ముంబై పోలీసులు అదే చేశారు. చనిపోయిన మహిళ రెండు హత్యలు చేసింది అంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Mumbai police : రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళపై హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు

Mumbai police assassinated cases on diad women

Updated On : July 14, 2023 / 1:47 PM IST

Mumbai police assassinated cases on diad woman: బైక్ నడిపే వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోలేదని..కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు కేసులు నమోదు చేసి ఫైన్ వేసిన ఫన్నీ కేసుల గురించి విన్నాం. కానీ ముంబై పోలీసులు అంతకు మించి అన్నట్లుగా రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన మహిళపై ఇప్పుడు హత్య కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 47 ఏళ్ల మహిళపై ముంబై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న మహిళపై హత్య కేసు నమోదు చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై పోలీసులు మహా ఘటికులే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

ముంబై నగర శివారు ప్రాంతంలోని నయానగర్ అనే ప్రాంతంలో నస్రీన్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో నివిసిస్తుండేది. ఆమెకు 47 ఏళ్లు. ఆమెకు 20 సద్నాజ్, 30 ఏళ్ల హర్ష్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఏమైందో ఏమోగానీ నస్రీన్ 2021 సెప్టెంబర్7న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు.

Viral Video : ఆధ్యాత్మిక కార్యక్రమంలో దారుణం.. మహిళ అని కూడా చూడకుండా పైకి ఎత్తి ఎలా విసిరేశాడో చూడండి

ఈ పోస్టుమార్టం నివేదికలో అవాక్కయ్యే విషయాలు బయటపడ్డాయి. ఈ నివేదిక పరిశీలించిన పోలీసులు చనిపోయిన నస్రీన్ పై హత్య కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏమింటంటే పోస్టుమార్టం రిపోర్టులో నస్రీన్ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేసిందని..ఆ తరువాత ఆమె స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుందని ఉంది. దీంతో పోస్టు మార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు చనిపోయిన ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసిందని కేసునమోదు చేశారు. నస్రీన్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

కానీ వీరి ఆత్మహత్యలు చేసుకుని రెండేళ్లు అవుతోంది. కానీ నస్రీన్ తన పిల్లలను చంపి…తరువాత తాను కూడాఆత్మహత్య చేసుకోవటానికి గత కారణాలు ఏంటో కూడా తెలియలేదు.దీంతో పోలీసులు అత్యుత్సాహానికి పోయి నస్రీన్ పై ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ మిస్టరీ ఛేదించాక అన్ని వివరాలు చెబుతామంటున్నారు. కానీ చనిపోయిన మహిళపై హత్య కేసులు నమోదు చేసిన ముంబై పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Karnataka: బెంగళూరు జంట హత్యల కేసుకు సంబంధించి షాకింగ్ వీడియో