నిర్భయ నిందితుడి పిటిషన్ పై విచారణ : సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

  • Publish Date - December 18, 2019 / 06:17 AM IST

సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. క్షమాభిక్ష పెట్టాలంటూ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన నిర్భయ తల్లిదండ్రులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

నిర్భయ కేసులో దోషిగా ఉన్న అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉరి శిక్షను పున:సమీక్షించాలని రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (డిసెంబర్ 18, 2019) ఎస్ ఏ బాబ్డే ధర్మాసనం నుంచి తప్పుకోవడంతో మరో త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరుగుతోంది. ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 

అక్షయ్ కుమార్ తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు జరిగిన తీరుపై, మరణ శిక్ష అనేది పరిష్కారం కాదు.  దీనికి సబంధించి అక్షయ్ మరణశిక్షను రివ్యూ చేయాలని, ఒక మనిషి జీవితాన్ని హతమార్చే హక్కు ఎవరికీ కూడా లేదని అక్షయ్ కుమార్ తరుపున ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు.

గత సబ్ జైలర్ ఆత్మహత్య వెనుక ముగ్గురు నిందితులుగా ఉన్నారు. ఒకరు జువైనల్ పై విడుదల అయ్యారు. మరొకరు రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మరో నలుగురు అక్షయ్, వినయ్, పవన్, ముఖేష్ తీహార్ జైలులో ఉన్నారు.