Manipur Violence: హింసను పెంచడానికి కోర్టును ఉపయోగించుకోకూడదు.. మణిపూర్ అల్లర్లపై సుప్రీం

ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ పిటిషనర్లను కోరారు

Supreme Court on Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను (సుప్రీంకోర్టు) వాడుకోవద్దని ధర్మాసనం కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని, అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని సోమవారం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రంలో హింసను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Ponguleti Srinivas Reddy: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి

ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ పిటిషనర్లను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ఇక పిటిషనర్ల తరపున వానదలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వెస్, మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పారు. అయితే గట్టి సూచన చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ ‘‘శాంతిభద్రతలను మేం అదుపులోకి తీసుకునేలా మీరు జాప్యం చేయకూడదు’’ అన్నారు.
అడ్వకేట్ గొంజాల్వెస్ సమాధానమిస్తూ, ‘‘మణిపూర్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి’’ అన్నారు.
అందుకు చంద్రచూడ్ బదులిస్తూ, ‘‘రాష్ట్రంలో ఉన్న హింస, ఇతర సమస్యలను మరింత పెంచడం కోసం వేదికగా ఈ ప్రొసీడింగ్‌ను వాడుకోకూడదు. భద్రతా యంత్రాంగాన్ని, శాంతిభద్రతలను మేం నడపలేము. సలహాలేమైనా ఇస్తే స్వీకరిస్తాం’’ అన్నారు.
ఇది మానవతావాదానికి సంబంధించిన సమస్యని, దీనిని పార్టీలకు సంబంధించిన అంశంగా చూడవద్దని తెలిపారు.
‘‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నాం, అయితే ఈ న్యాయస్థానంలో వాదించడానికి కొన్ని పద్ధతులు ఉండాలి’’ అని సీజేఐ అన్నారు.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి

మణిపూర్‌లో మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కుకీ సహా మరికొన్ని గిరిజన జాతులు మే 3 నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హింస భగ్గుమంది. రెండె నెలలుగా తీవ్ర హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసలో ఇప్పటికే 150 మందికి పైగా మరణించారు. కేంద్ర బలగాలను రాష్ట్రంలో దింపినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

ట్రెండింగ్ వార్తలు