Ponguleti Srinivas Reddy: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్ర, ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చించారు.

Ponguleti Srinivas Reddy: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి

Batti and Ponguleti (File Photo)

Ponguleti Srinivas Reddy: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వచ్చాయి. వీరి భేటీలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంపై చర్చ జరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై పొంగులేటి స్పష్టత ఇచ్చారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసేందుకు ఆయన నివాసానికి పొంగులేటి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి, భట్టిలు కొద్దిసేపు రాష్ట్ర, ఖమ్మంజిల్లా రాజకీయాలపై చర్చించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponguleti Srinivasa Reddy: జరగరానిది జరిగిపోతే ఎవరు బాధ్యులు?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చాముని అన్నారు. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చించడం జరిగిందని పొంగులేటి చెప్పారు. ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరు సీఎం కేసీఆర్ పట్ల.. ‘నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’ అన్నట్లుగా ఉందంటూ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలు ఉన్నాయని, వాటిలో ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండు వ్యతిరేక వర్గం మాత్రమే అన్నారు. ప్రజలు ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని బలంగా డిసైడ్ అయ్యారంటూ పొంగులేటి జోస్యం చెప్పారు.

Ponguleti Srinivas Reddy: అందుకే కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు: పొంగులేటి

ఇటీవల ఏపీ వెళ్లిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు వచ్చిన వార్తలపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. నేను ఏపీ వెళ్లిన మాటవాస్తవమే. అయితే, కేవలం సీఎంఓ అధికారులను మాత్రమే కలిశా. జగన్మోహన్ రెడ్డిని మాత్రం నేను కలవలేదు అని అన్నారు. నా సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించానని తెలిపారు. షర్మిల టాపిక్ ఏమాత్రం చర్చించలేదని పొంగులేటి చెప్పారు. వైఎస్ఆర్సీపి పార్టీని తెలంగాణలో వద్దనుకున్నాడు జగన్. అలాంటిది చెల్లి కోసం ప్రయత్నం అంటూ ఉండదని అన్నారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు.. వాళ్లే చూసుకుంటారు అంటూ పొంగులేటి తెలిపారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో జరిగింది మర్యాద పూర్వక సమావేశమేనని చెప్పారు. పాదయాత్ర పూర్తయిన తరువాత నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు పొంగులేటి శ్రీనివాస రెడ్డి నన్ను కలిశారని చెప్పారు. జరిగింది మర్యాద పూర్వక సమావేశమే అయిన మా మధ్య ఖమ్మం జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంపై మాట్లాడు కోవడం జరిగిందని భట్టి చెప్పారు.