Ponguleti Srinivas Reddy: అందుకే కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు: పొంగులేటి

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు.

Ponguleti Srinivas Reddy: అందుకే కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy

Updated On : July 2, 2023 / 7:04 PM IST

Ponguleti Srinivas Reddy – Khammam: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఇందులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అనంతరం పొంగులేటి మాట్లాడారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదని గుర్తుచేశారు.

రాష్ట్రంలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పొంగులేటి అన్నారు. ఖమ్మం సభకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. భావిభారత్ కు రాహుల్ గాంధీ దిక్సూచి అని అన్నారు.

కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలపాలని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని చెప్పారు. ఉద్యోగాలు రాక యువత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Ponguleti Srinivas Reddy: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, పలువురు నేతలు