Delhi Air Pollution : ఢిల్లీలోకి పర్మిషన్ లేని వాహనాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు సీరియస్..

రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Delhi Air Pollution (Photo Credit : Google)

Delhi Air Pollution : ఢిల్లీలో విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించే అంశంపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విద్యార్థులకు ఫిజికల్ క్లాసుల నిర్వహణకు సంబంధించి సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆన్ లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్ లేవని, అలాంటప్పుడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒక్కటేనని అభిప్రాయపడింది. రేపటిలోగా విద్యాసంస్థలను తెరిచే అంశాన్ని పరిశీలించాలని సీఏక్యూఎంకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పర్మిషన్ లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించినందుకు అధికారులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం.. అనుమతి లేని వాహనాలు ఢిల్లీలోకి రాకుండా చూస్తామంది.

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4వ దశ కింద అత్యవసర చర్యలు ప్రస్తుతానికి ఢిల్లీలో కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు ఏఎస్ ఓకా, ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం స్కూల్స్ (IV, అంతకంటే ఎక్కువ తరగతులు) ఇతర విద్యాసంస్థలను పునఃప్రారంభించడంపై నిర్ణయం తీసుకోవడానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM)కి వదిలివేసింది.

”ఢిల్లీకి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణాంకాల చార్ట్‌ను సమీక్షించిన బెంచ్.. “ఇది AQI… నవంబర్ 20 నుండి 24 నవంబర్ వరకు 318 నుండి 419 వరకు ఉంటుందని చూపిస్తుంది… స్థిరమైన డౌన్‌వర్డ్ ట్రెండ్ ఉందని కోర్టు సంతృప్తి చెందకపోతే.. కమిషన్‌ను స్టేజ్ 3 లేదా స్టేజ్ 2కి వెళ్లడానికి అనుమతించలేము” అని బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ..! ఏపీ పోలీసుల వేట..