Ram Gopal Varma : పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ..!

శంషాబాద్, షాద్ నగర్ లోని రెండు ఫామ్ హౌస్ లపైన కూడా ఫోకస్ పెట్టారు.

Ram Gopal Varma : పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ..!

Director Ram gopal varma (Photo Credit : Google)

Updated On : November 25, 2024 / 6:27 PM IST

Ram Gopal Varma : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చిన రెండు పోలీసు బృందాలు వర్మ కోసం గాలిస్తున్నాయి.

ఆర్జీవీ హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. శంషాబాద్, షాద్ నగర్ లోని రెండు ఫామ్ హౌస్ లపైన కూడా ఫోకస్ పెట్టారు. ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్.. వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో సాయంత్రంలోగా ఆర్జీవీని పోలీసులు అదుపులోకి తీసుకునే చాన్స్ ఉంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి చేరుకున్నాయి. వర్మ అయితే ప్రస్తుతం అందుబాటులో లేడు. ఉదయం నుంచి అతడు కానీ, అతడి సిబ్బంది కానీ అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. వర్మ తన ఇంట్లో లేడని తెలుసుకున్న పోలీసులు.. అతడి కోసం అతడి ఇంటి పరిసరాల్లో కాపు కాచారు. కాగా వర్మ లొకేషన్ షాద్ నగర్ ఏరియాలో చూపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా వర్మ కొన్ని పోస్టులు పెట్టారు. దీనిపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి పోస్టులు చేసిన వారందరిని అరెస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్మపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో వర్మ అనుచిత పోస్టులు పెట్టినట్లుగా ఒంగోలు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వర్మకు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 25న విచారణకు రావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ తరపు న్యాయవాది పోలీసులకు రిప్లయ్ ఇచ్చారు. అయితే, దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. విచారణకు హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చినా వర్మ రాలేదన్నారు. దీంతో వర్మను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు.

కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని వర్మ తరపు లాయర్లు అంటున్నారు. వర్చువల్ గా హియరింగ్ కు హాజరవుతామని చెప్పినా తమకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉన్నందున తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైతే పోలీసుల విచారణకు వర్మ రాలేరని అతడి తరపు లాయర్లు తెలిపారు.

Also Read : చంద్రబాబును తిట్టిన వాళ్లను వదిలేది లేదు- కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్