Supreme Court : ప్రధాని కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై సుప్రీంలో పిటిషన్..

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది.

Supreme Court : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీ రీజన్స్‌తో మోడీ పర్యటన రద్దవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగే ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యానికి కారణం ఎవరు అనేదానిపై అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాల్సిందిగా మణీందర్ సింగ్ సుప్రీంను కోరారు. ప్రధాని మోదీ కాన్వాయ్ కు భద్రతా వైపల్యంపై అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ వాదించారు.

ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధాని కాన్వాయ్ లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలన్నారు. కానీ, ప్రధాని కాన్వాయ్‌లో వారిద్దరూ లేరిని వెల్లడించింది. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. దాంతో సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (జనవరి 7)న విచారణ చేపడతామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హైలెవెల్‌ కమిటీని పంజాబ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనిపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఛన్నీ ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల పంజాబ్‌ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డగించారు. దీనిపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు మండిపడ్డాయి. ప్రధాని కాన్వాయ్‌ భద్రతా వైఫల్యానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ప్రజలు వరుసగా తిరస్కరిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ పిచ్చి మార్గంలో పయనిస్తోందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా విధానం, పనితీరుకు పంజాబ్‌లో చోటుచేసుకున్న ఘటన ఒక ట్రైలర్‌ మాత్రమేనన్నారు. ప్రజల చేతిలో వరుసగా కాంగ్రెస్ తిరస్కరణకు గురవుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పిచ్చి మార్గంలో వెళుతోందని మండిపడ్డారు. పంజాబ్‌ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు.

Read Also : palvancha: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

ట్రెండింగ్ వార్తలు