Supreme Court : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Supreme Court

SC/ST Categories Sub-Classification : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధించింది. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజే చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేల ఏం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7గురు సభ్యుల ధర్మాసనం పక్కన పెట్టింది.

Also Read : Pawan Kalyan : ఎయిర్ పోర్ట్‌లో అభిమానులతో సందడి చేసిన డిప్యూటీ సీఎం.. చిన్ని అభిమానిని ఎత్తుకొని..

విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల లో క్యాటగిరి చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Also Read : Gold Price Today : బంగారంకు ఏమైంది.. మళ్లీ గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే?

మంత్రి దామోదర రాజనర్సింహ ఏమన్నారంటే..
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. మా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. 30ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది. ఇన్నేళ్లు ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ తీర్పు ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పారు. ఉద్యోగ, విద్యా రంగంలో సమన్యాయం జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం రాగానే ప్రత్యేక అడ్వకేట్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు