Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవన రికార్డును బద్దలు కొట్టిన భారత్.. ఈ భవనాన్ని చూస్తేనే కళ్లు తిరుగుతాయి..

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.

Surat Diamond Bourse

Surat Diamond Bourse – Pentagon: ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం ఏది అంటే అమెరికా రక్షణ శాఖ (US Department of Defense) ఆఫీసు ది పెంటగాన్ అని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో దాన్ని కట్టారు. 1941 సెప్టెంబరు 11న ప్రారంభమైన నిర్మాణ పనులు 1943 జనవరి 15న ముగిశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు (80 ఏళ్ల పాటు) ఆ భవనమే ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనంగా కొనసాగుతోంది.


Surat Diamond Bourse

అయితే, ఇకపై ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం ఏది అన్న ప్రశ్నకు భారత్ లోని సూరత్ డైమండ్ బోర్స్ (Surat Diamond Bourse) అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సీఎన్ఎన్ ఓ నివేదికలో పేర్కొంది. గుజరాత్ లోని సూరత్ లో డైమండ్ బోర్స్ ను నిర్మించారు. సూరత్ ప్రపంచంలోనే రత్నాల రాజధానిగా పేరొందింది.

ప్రపంచంలోనే 90 శాతానికి పైగా డైమండ్ కట్టింగ్ కంపెనీలు సూరత్ లో ఉన్నాయి. ప్రపంచంలోని డైమండ్ కట్టింగ్ పనులు 82-92 శాతం మధ్య ఇక్కడే జరుగుతాయి. దీంతో సూరత్ లో డైమండ్ ట్రేడింగ్ కేంద్రాన్ని నిర్మించారు. డైమండ్ కట్టర్లు, పాలిషర్లు, ట్రేడర్ల వంటి 65,000 మందికి పైగా నిపుణుల కోసం దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఈ భవనం మొత్తం 15 అంతస్తులు ఉంటుంది. 35 ఎకరాల భూమిలో దీన్ని నిర్మించారు. ఇందులో 9 దీర్ఘచతురస్రాకార నిర్మాణాలు ఉంటాయి. ఈ భవన ఫ్లోర్ స్థలం 68 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. ఈ ఏడాది నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఈ భవనాన్ని భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మార్ఫోజెనిసిస్ నిర్మించింది.

సూరత్ డైమండ్ బోర్స్ వీడియో..

ఇది పెంటగాన్ భవనం..

Pentagon

Mercedes-Benz GLC SUV : రెండో జనరేషన్ మెర్సిడెస్-బెంజ్ GLC వచ్చేస్తోంది.. ఆగస్టు 9నే లాంచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!