Gujarat Businessman: పద్మశ్రీ వ్యాపారవేత్తకు కుటుంబ సభ్యులు “హెలికాప్టర్ గిఫ్ట్”, దాన్ని ఏం చేశాడంటే?

సావ్జీ ధోలాకియా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. కుటుంబ సభ్యులు.. ఏకంగా రూ.50 కోట్లు విలువ చేసే హెలికాప్టర్ ను బహుమతిగా అందించారు.

Gujarat Businessman: ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు, సామజిక కార్యకర్తలకు భారత ప్రభుత్వం పద్మా అవార్డులు అందించిన సంగతి తెలిసిందే. వివిధ అంశాల్లో అత్యున్నత సేవ, ప్రతిభ కనబరిచిన వారికి ఈ అత్యున్నత పౌరపురష్కారాలను భారత ప్రభుత్వం అందిస్తుంటుంది. గుజరాత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త సావ్జీ ధోలాకియా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సావ్జీ ధోలాకియా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి.. భారత ప్రభుత్వం ఈ అవార్డును అందించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పద్మశ్రీ.. సావ్జీ ధోలాకియాను వరించడంతో.. ఆయన కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో ఆయనకు చిరకాలం గుర్తుండిపోయేలా.. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని భావించిన కుటుంబ సభ్యులు.. ఏకంగా రూ.50 కోట్లు విలువ చేసే హెలికాప్టర్ ను బహుమతిగా అందించారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతి అందుకున్న సావ్జీ.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

Also read: ‘Kacha Badam’ Song :ఈ పల్లీలు అమ్మే వ్యక్తి పాటకు ప్రపంచమే ఫిదా..లల్లాయి పాటతో వరల్డ్ వైరల్

అయితే ఆ హెలికాప్టర్ ను వెంటనే సూరత్ పట్టణానికి అంకితం చేశాడు సావ్జీ ధోలాకియా. గుజరాత్ రాష్ట్రానికే ఆర్ధిక రాజధానిగా ఉన్న సూరత్ నగరంలో అన్ని సదుపాయాలు ఉన్నా.. అత్యవసర వైద్యసమయంలో మరో నగరానికి వెళ్లేందుకు హెలికాప్టర్ అంబులెన్సు లేదని.. అందుకే తనకు తన కుటుంబ సభ్యులు ఇచ్చిన హెలికాప్టర్ ను.. ఎయిర్ అంబులెన్సుగా మార్చి సూరత్ వైద్యశాఖకు అందించనున్నట్లు సావ్జీ ధోలాకియా ప్రకటించారు. తనపై ఎంతో ప్రేమతో కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతిపై తనకు ఎంతో గౌరవం ఉందని.. అదే సమయంలో తన నిర్ణయాన్ని వారు గౌరవిస్తారని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సావ్జీ ధోలాకియా చెప్పుకొచ్చారు.

Also read: Kacha Badam: పల్లీలు అమ్ముకునే వ్యక్తి జీవితాన్నే మార్చేసిన “కచ్చా బదాం”

సూరత్ లో సాధారణ కుటుంబంలో జన్మించిన సావ్జీ ధోలాకియా.. అంచెలంచెలుగా ఎదిగి వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో వజ్రాల ఎగుమతి, వజ్రాలకు సానబెట్టడం వంటి వ్యాపారాలు చేస్తున్నాడు. ఇదే కాదు.. తమ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే సావ్జీ.. పండగల సమయంలో వారికి ఇల్లు, కార్లు, నగదు బహుమతులు ఇస్తూ ఆత్మసంతృప్తి వ్యక్తం చేసేవాడు. ఒకరిపై ఆధారపడకుండా ప్రతి వ్యక్తి సొంతంగా ఎదగాలనని భావించే సావ్జీ.. తన కుమారుడికి రూ.7000 చేతిలో పెట్టి.. కొన్ని రోజుల పాటు సొంతంగా జీవించాలని పంపించాడు. ఎవరి సహాయం తీసుకోకుండా, స్నేహితులను, కుటుంబ సభ్యులను కలవకూడదని షరతు పెట్టాడు. తండ్రి మాటని జవదాటని ఆతను కేవలం రూ.4000 జీతానికి కేరళలో టీ కొట్టులో కొన్నాళ్ళు, కాల్ సెంటర్ లో కొన్నాళ్ళు పనిచేసాడు. మనుషులు జీవితంలో ఎదగలిగానీ..నేల విడిచి సాము చేయకూడదనే నానుడిని సావ్జీ ధోలాకియా అక్షరాలా పాటిస్తున్నారు.

Also read: AP Crime News: విజయనగరం జిల్లాలో భార్యను హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త

ట్రెండింగ్ వార్తలు