Kacha Badam: పల్లీలు అమ్ముకునే వ్యక్తి జీవితాన్నే మార్చేసిన “కచ్చా బదాం”

సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి రుజువు చేశారు మన భారతీయులు. పల్లీలు అమ్ముకుని జీవించే ఓ వ్యక్తి పాటను వైరల్ చేసేసి అతని జీవితాన్ని మలుపుతిప్పారు.

Kacha Badam: పల్లీలు అమ్ముకునే వ్యక్తి జీవితాన్నే మార్చేసిన “కచ్చా బదాం”

Kacha Badam

Kacha Badam:  సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి రుజువు చేశారు మన భారతీయులు. ఆమధ్య కరోనా లాక్ డౌన్ సమయంలో ఢిల్లీలోని ఓ వృద్ధుడి టిఫిన్ సెంటర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మన యువత రాత్రికిరాత్రే ఆ వృద్ధుడి జీవితాన్ని మార్చేశారు. ఇప్పుడు పల్లీలు అమ్ముకుని జీవించే ఓ వ్యక్తి పాటను వైరల్ చేసేసి అతని జీవితాన్ని మలుపుతిప్పారు. “కచ్చా బదాం” ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న పాట. సినీ సెలెబ్రిటీల నుంచి దేశ విదేశాల్లోని యువత ఈ “కచ్చా బదాం” పాటకు ఊగిపోతున్నారు. ఇంస్టాగ్రామ్, టిక్ టాక్, జోష్ యాప్ లలో పోస్టులు పెడుతూ వ్యూస్ సంపాదిస్తున్నారు. అయితే అసలు ఈ కచ్చా బదాం ఎక్కడి నుంచి వచ్చింది?. ఎందుకు ఇంత ట్రెండ్ అయింది?.

Also read:AP PRC: ఐఆర్ అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోనూ లేదే..పీఆర్సీని కూడా రుణం అంటారేమో..!

“కచ్చా బదాం” అనేది పచ్చి పల్లీలకు బెంగాలీ పదం. పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్‌జూరి గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పల్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఊరూరూ తిరుగుతూ పాత సమానుకి.. పచ్చి పల్లీలు అమ్ముకునే భుబన్.. కస్టమర్లను ఆకర్శించేందుకు రకరకాల పాటలు పాడుతుండేవాడు. ఇంటిలో పాడైపోయిన వస్తువులు, చేతి గాజులు, పనికిరాని గిల్టు నగలు తనకు ఇస్తే.. పాలుగారే పచ్చి పల్లీలు ఇస్తానంటూ కస్టమర్లకు క్యానవాస్ చేస్తుంటాడు. అయితే రోజూ చెప్పిందే చెప్పే కంటే.. తాను వాడే పదాలనే పాటగా మార్చి చెబితే.. గ్రామాల్లోని ప్రజలు మరింత ఆకర్షితులవుతారని గ్రహించిన భుబన్.. ఆమేరకు ఆ పదాలన్నిటిని కలిపి.. ఈ “కచ్చా బదాం” పాటను రూపొందించాడు.

Also read: AP Crime News: విజయనగరం జిల్లాలో భార్యను హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త

బెంగాలీ పదాలతో, భారతీయ జానపద గేయాల్లోని రాగాలతో ఈ పాటను కంఠస్థం చేసుకున్న భుబన్.. ఇక ఊరూరా తిరుగుతూ, ఈపాటను పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఈక్రమంలో గతేడాది నవంబర్ లో ఒక యూట్యూబ్ వ్లోగర్.. భుబన్ పాటను వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అది చూసిన కొందరు హిందీ సంగీత ప్రియులు.. దాన్ని రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. లిరిక్స్ అర్ధం కాకపోయినా..వినగానే ఆకట్టుకుంటున్న ఈ పాటకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంకేముంది.. నెల రోజుల్లో పాటను సూపర్ వైరల్ చేశారు. దేశం ధాటి, ఖండాంతరాలు ధాటి “కచ్చా బదాం” సృష్టిస్తున్న సునామి అంతాఇంతాకాదు. కొరియా నుంచి టాంజానియా దాక కచ్చా బదాం పాకింది.

Also read: Minister KTR: తెలంగాణ వంటి పాలన దేశంలోనే లేదు: మంత్రి కేటీఆర్

ఇక కచ్చా బదాం పాట వైరల్ అవడంతో.. దీని ఒరిజినల్ సింగర్ కోసం నేషనల్ మీడియా వెతకగా భుబన్ గురించి తెలిసింది. అంతే కాదు.. కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, పశ్చిమబెంగాల్ లోని పాపులర్ సింగర్లు భుబన్ ను కలిసి ఆ పాట రైట్స్ కొనుక్కున్నారు. మరికొందరు ఏకంగా భుబన్ ను తమ ఆల్బంలో భాగం చేసి.. వీడియోలు కూడా తీశారు. ఒక్క పాటతో తన దిశ తిరిగింది, కలలో కూడా ఊచించని విధంగా తనకొచ్చిన ఈ ఆదరణను చూసి భుబన్ ఉప్పొంగిపోతున్నాడు. ఒక్క పాట తన జీవితాన్నే మార్చేసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో.. బీసీసీఐ అధ్యక్షుడు, బెంగాల్ ప్రజల ఆరాధ్యుడు సౌరవ్ గంగూలీ కూడా భుబన్ ను కలుసుకుని అభినందించనున్నట్లు సమాచారం. టాలెంట్ ఉండాలేగాని ఏ రోజు ఎవరి జాతకం మారిపోతుందో చెప్పడానికి భుబన్ బద్యాకర్ ఒక ఉదాహరణ.

Also read: Horse Racing: ఆన్‌లైన్‌లో గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులు అరెస్ట్