ట్విట్టర్‌లో సుష్మా బిగ్గెస్ట్ రాక్ స్టార్

  • Published By: madhu ,Published On : February 22, 2019 / 03:20 PM IST
ట్విట్టర్‌లో సుష్మా బిగ్గెస్ట్ రాక్ స్టార్

Updated On : February 22, 2019 / 3:20 PM IST

ఎవరైనా సహాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరితే వెంటనే స్పందించే ఉదారగుణం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఉంది. అదే ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్‌లను కల్పించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన పాత్ర పోషించే ట్విట్టర్‌ను సుష్మా చురుకుగా వాడుతుంటారు. సమస్యల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులకు ట్విట్టర్ ద్వారానే పరిష్కారం చూపుతూ శభాష్ అనిపించుకున్నారు సుష్మా. ట్వీట్ చేయడం ఆలస్యం వెంటనే సుష్మా రెస్పాండ్ కావడం సహాయానికి సంబంధించిన విషయాలు తెలియచేస్తారు. విదేశాంగ మంత్రిగా ఉండడంతో వీసాలు, విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్యలు, ఇతరత్రా వాటిపై సుష్మా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తుంటారు. 

కేంద్ర మంత్ర సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో బిగ్గెస్ట్ రాక్ స్టార్‌గా నిలిచారు. ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నాటికి ఫాలో అవుతున్న వారి సంఖ్య 12.1 మిలియన్ (1, 21, 00, 000)గా ఉంది. ఏ సెలబ్రిటీకి రాని రెస్పాండ్ ఆమెకు వస్తోంది. పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ఆమె 5 స్థానంలో ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 45.8 మిలియన్, అరవింద్ కేజ్రీవాల్ 14.5 మిలియన్, అరుణ్ జైట్లీ 14 మిలియన్, అమిత్ షా 12.6 మిలియన్, రాజ్ నాథ్ సింగ్ 12.2 మిలియన్ ఫాలోవర్స్ గా ఉన్నారు. పలువురు ప్రముఖులు సైతం ఈమెను ఫాలో అవుతూ ఉంటారు. 

సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో అగ్రగణ్యురాలు. కేంద్ర మంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన ఈమె 1977లో హర్యానా రాష్ట్ర శాసనభలో అడుగు పెట్టారు. 1996, 1998 వాజయ్ పేయి మంత్రవర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ సీఎంగా ఉన్నారు. 2014 మే 26 నరేంద్ర మోడీ కేబినెట్ కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. భారత విదేశాంగ మంత్రిగా సుష్మా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.