Swiggy post make you laugh : ‘ఉప్మా’ షూస్ పోస్ట్‌కు ‘స్విగ్గీ’ కామెడీ రిప్లై

మార్కెట్లలో పెద్ద బ్రాండ్ల స్ధానంలో నకిలీ బ్రాండ్లు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా 'ప్యూమా'కి బదులు 'ఉప్మా' అనే నకిలీ షూస్ బ్రాండ్ ప్రత్యక్షమైంది. దీనిని కొనుగోలు చేసిన వినియోగదారుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతని పోస్ట్ పై స్విగ్గీ కామెడీగా స్పందించింది.

Swiggy post make you laugh

Swiggy post make you laugh : రీసెంట్‌గా ఓ ట్విట్టర్ యూజర్ తన నకిలీ ప్యూమా షూస్ ఫోటోని షేర్ చేసుకున్నాడు. దానికి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ పెట్టిన రీ ట్వీట్ అందర్నీ నవ్విస్తోంది. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Father whatsapp status : తండ్రి వాట్సాప్ స్టేటస్ షేర్ చేసిన కూతురు.. రియాక్టైన స్విగ్గీ

సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ? Yatharth (blue tick) ట్విట్టర్ యూజర్ తను కొనుగోలు చేసిన బూట్ల ఫోటోలను షేర్ చేసుకున్నారు. దానిపై బ్రాండ్ నేమ్ ఉప్మా (UPMA) అని ఉంది. ఉప్మా అనేది దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన అల్పాహార వంటకం. ‘నిన్న ఈ రుచికరమైన షూలని స్ధానిక మార్కెట్ నుండి 690 బక్స్‌కి పొదుపుగా తీసుకున్నాను. సమాజం నన్ను అంగీకరిస్తుందా’ అనే ఫన్నీ ట్యాగ్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

Tamil Nadu : తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన జొమాటో డెలివరీ ఏజెంట్.. అభినందనలు చెబుతున్న నెటిజన్లు

ఇక ఈ పోస్ట్‌పై స్విగ్గీ స్పందించింది. Swiggy Instamart తన ట్విట్టర్ ఖాతా నుంచి ‘కొనుగోలు చేయడానికి ముందు మా యాప్‌ని తనిఖీ చేసి ఉండాలి. ఇత్నా మెహంగా నహీ మిల్తా’ అని రీ ట్వీట్ చేస్తూ రెడీమేడ్ ఉప్మా మిక్స్ ఫోటోను షేర్ చేసింది. ఇక వీరి ట్వీట్లు, రీ ట్వీట్లు నెటిజన్లకు నవ్వు తెప్పించాయి. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.