మా బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్ చేశారు.. కాంగ్రెస్ అగ్ర నేతల ప్రశ్న

ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన తమ పార్టీ బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కాంగ్రెస్ అగ్ర నాయకులు చేశారు.

Congress bank accounts freezing: తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన తమ పార్టీ బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీపై కావాలనే కక్ష సాధింపు చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని.. దీనిపై చట్టపరంగా పోరాడతామని ప్రకటించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే నిష్పక్ష, పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు.

ఎందుకు ఇలా చేస్తున్నారు: మల్లికార్జున ఖర్గే
ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పక్షపాత ఎన్నికలు అనివార్యం
అన్ని పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ (సమాన స్థాయి అవకాశం) ఉండాలి
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారం చాలా విచారించదగ్గది
అధికారపక్షానికి వేల కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా వచ్చాయి
మరోవైపు ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం జరిగింది
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయడం అధికారపక్షం చేసిన దుష్టపన్నాగం
ఒక రాజకీయపార్టీని అసహాయస్థితిలో పడేస్తే ఇవి నిష్పక్ష, పారదర్శక ఎన్నికలు అని ఎలా చెప్పగలం?
అధికారపక్షానికి 56 శాతం నిధులు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 11 శాతం మాత్రమే వచ్చాయి
ప్రింట్, టీవీ, సోషల్ మీడియాలో అధికార పక్షానిదే డామినేషన్ స్పష్టంగా ఉంది
ఆ పార్టీకి అన్ని చోట్లా 5-స్టార్ ఆఫీసులు ఉన్నాయి. ప్రత్యేక విమానాల్లో నేతలు తిరుగుతున్నారు
ఒక్కో మీటింగ్ కోసం ఎంత ఖర్చవుతుందో అందులో ప్రతిపక్షం కనీసం10 శాతం కూడా ఖర్చు చేయలేదు
రాజ్యాంగ సంస్థలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు కోరుకుంటే మా బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేలా చేయండి
ఇన్‌కం ట్యాక్స్ వివాదం ఏదైనా సరే కోడ్ ముగిసిన తర్వాత ఉండాలి
ఏ రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను ఉండదు. బీజేపీకి కూడా ఉండదు
కానీ కాంగ్రెస్ మీద మాత్రమే ఆదాయపు పన్ను శాఖ ఎందుకు ఇలా పనిచేస్తోంది
దీనిపై న్యాయస్థానంలో పోరాడుతున్నాం. తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
ఫ్రీజ్ చేసిన మా ఖాతాలను ఈలోగా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది
అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడానికి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉంటుంది

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలు స్తంభింప చేశారు
200 కోట్ల రూపాయల జరిమానా వేశారు
ఆలస్య చెల్లింపులకు పదివేలకు నుంచి జరిమానా లేదు
ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు
డబ్బులు లేకపోవడంతో అడ్వర్టైజ్మెంట్స్ బుక్ చేసుకోలేకపోతున్నాం
మా అభ్యర్థులకు సహాయ పడలేకపోతున్నాం
విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం
ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి

Also Read: మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ ఎందుకు పోటీ చేస్తున్నారు.. కారణం అదేనా?

ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నం: సోనియాగాంధీ
కాంగ్రెస్ తీవ్ర మైన ఆర్ధిక సమస్య ఎదుర్కొంటుంది
ఇది కాంగ్రెస్‌పైనే కాదు – ప్రజాస్వామ్యంపైనే అత్యంత ప్రభావం చూపుతుంది
ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు
ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను నిలిపివేసి, మా ఖాతాల్లోని సొమ్మును బలవంతంగా లాక్కుంటున్నారు
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నికల ప్రచారం కొనసాగించడానికి మా వంతు కృషి చేస్తున్నాం
ఒకవైపు ఎలక్టోరల్ బాండ్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది
ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి భారీగా లబ్ధి చేకూర్చాయి
ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆర్థికస్థితిపై దాడి జరుగుతుంది

Also Read: ఎన్నికల వేళ భారత్ ఎటువైపు? దేశంలోని ప్రధాన నేతలు, వారి మైనస్ పాయింట్లు ఇవే..

ట్రెండింగ్ వార్తలు