మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ.. యూపీకి గాంధీ ఫ్యామిలీ గుడ్ బై?

గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ.. యూపీకి గాంధీ ఫ్యామిలీ గుడ్ బై?

Gandhi Family Politics: యూపీకి గాంధీ ఫ్యామిలీ గుడ్ బై చెప్పినట్లే కనిపిస్తోంది. రాజకీయ కంచుకోటగా ఉన్న అమేథీ, రాయబరేలీ నుంచే ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చింది గాంధీ ఫ్యామిలీ. 2019 వరకు అమేథీ, రాయబరేలీ నెహ్రూ, గాంధీ కుటుంబాలకు కంచుకోటలుగా ఉండేవి. 2019లో తొలిసారి ఆ రెండు సీట్లలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ అతికష్టం మీద గట్టెక్కారు.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడినా.. లక్కీగా కేరళలోని వాయనాడ్ నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇక కేరళానే తన రాజకీయ క్షేత్రంగా మార్చుకున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఆయన వాయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. రెండోసీటులో పోటీపై రాహుల్ ఆసక్తిగా లేనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభ సభ్యురాలుగా మారారు. అటువంటి పరిస్థితిలో ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని, అలాగే రాహుల్ గాంధీ తన పాత సీటు అమేథీ నుంచి కూడా బరిలోకి దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇద్దరూ యూపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ నుంచి గాంధీ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయడం లేదని స్పష్టమైంది.

Also Read: కేంద్రంలో అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు.. కాంగ్రెస్ హామీ

గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఇంతకు గాంధీ కుటుంబం యూపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లడానికి కారణమేంటన్న దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. యూపీలో బీజేపీ అంతకంతకు బలపడుతోంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ యూపీలో బీజేపీ గట్టి పట్టే సాధించింది. పైగా అమేథీ, రాయబరేలీపై ప్రత్యేక దృష్టి పెట్టి.. రాహుల్, సోనియాను ఓడించాలని పనిచేసింది బీజేపీ. దాంతో సేఫ్ జోన్‌గా వాయనాడ్‌కు షిఫ్ట్ అయ్యారు రాహుల్. సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా రాజ్యసభకు ఎంపికయ్యారు.

Also Read: ప్రధాని మోదీ భూటాన్ రెండు రోజుల పర్యటన వాయిదా.. అసలు కారణమిదే!

నెహ్రూ-గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలతో నాలుగు తరాల బంధం ఉంది. ఫిరోజ్ గాంధీ మొదటిసారి రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొదట సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ అమేథీని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. అయితే అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి ఐదేళ్లవుతోంది. కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్‌, ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు. దీంతో అమేథీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం మునుపటిలా లేదు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు వయనాడ్ స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.