PM Modi Bhutan Visit : ప్రధాని మోదీ భూటాన్ రెండు రోజుల పర్యటన వాయిదా.. అసలు కారణమిదే!

PM Modi Bhutan Visit : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా హిమాలయ దేశమైన భూటాన్ వెళ్లాల్సి ఉంది. అనివార్యకారణాల వల్ల మోదీ పర్యటన వాయిదా పడింది.

PM Modi Bhutan Visit : ప్రధాని మోదీ భూటాన్ రెండు రోజుల పర్యటన వాయిదా.. అసలు కారణమిదే!

PM Narendra Modi's 2-Day Bhutan Visit Postponed Due To Inclement Weather

PM Modi Bhutan Visit : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడింది. పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మోదీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ హిమాలయ దేశమైన భూటాన్‌లో రెండు రోజులు పర్యటించాల్సి ఉంది.

Read Also : పవన్ కల్యాణ్ తప్పుకుంటే పిఠాపురంలో కచ్చితంగా నేనే పోటీ చేస్తా- టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడినట్టు విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మార్చి 21 నుంచి 22 తేదీల్లో భూటాన్‌లో ప్రధాని పర్యటనను వాయిదా వేయాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. కొత్త తేదీలను దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు వెల్లడించనున్నాయి’ అని ప్రకటన పేర్కొంది.

మోదీ పర్యటన భారత్, భూటాన్ మధ్య సాధారణ ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. పొరుగుదేశ ఫస్ట్ పాలసీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అని పత్రికా ప్రకటన తెలిపింది. ప్రధానమంత్రి పర్యటనకు ముందు దేశానికి స్వాగతం పలికేందుకు పర్వత రహదారులపై భారీ పోస్టర్లు వెలిశాయి.

నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీకి ప్రాధాన్యతనిస్తూ న్యూఢిల్లీ, థింపూ మధ్య జరిగే ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఈ పర్యటన ఉందని భారత ప్రభుత్వం ఇంతకు ముందు పేర్కొంది. భూటాన్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం మోదీ.. ఆ దేశ ప్రధాని అయిన షెరింగ్ టోబ్‌గేతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందని ఎంఈఏ తెలిపింది.

భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే గత వారం ఐదు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. గత జనవరిలో అత్యున్నత కార్యాలయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటి విదేశీ పర్యటన ఇదే. భూటాన్ ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై అనంతరం ప్రధాని మోదీని కలిశారు.

Read Also : Telangana Congress : ఇటు సీనియర్లు, అటు వలస నేతలు.. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ