Agra : తాజ్ మహల్ సందర్శనకు ప్రజలకు అనుమతి

ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక్షలు సడలిస్తున్నారు.

Taj Mahal Reopen To Public

Taj Mahal Reopen : ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక్షలు సడలిస్తున్నారు.

పలు రాష్ట్రాల్లో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతుండడంతో ఆంక్షలను సడలిస్తోంది. అందులో భాగంగా..తాజ్ మహల్ సందర్శనకు ప్రజలకు అనుమతినివ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

తాజ్ మహల్ సందర్శించే వారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 650 మందిని సందర్శించేందుకు అనుమతినిస్తారు. సందర్శకులు ఒక దగ్గరే గుమికూడకుండా చూసేందుకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షించనున్నారు. సందర్శకులు నడిచే సమయంలో వారి పాదరక్షలు శానిటైజ్ అయ్యే విధంగా ప్రత్యేక ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు.