Tamil Nadu : ఆరో తరగతి విద్యార్థినికి సీఎం ఫోన్..ఏం చెప్పారంటే
కర్నాటక సరిహద్దలో ఉన్న హోసూరులో టైటాన్ టౌన్ షిప్ కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో అంటూ ఓ లేఖ రాసింది.

Stalin
CM Calls Up Class VI Student : ముఖ్యమంత్రి ఫోన్ చేయడంతో ఆరో తరగతి విద్యార్థిని ఆశ్చర్యపోయింది. సీఎం తనతో ఫోన్ లో మాట్లాడటాన్ని నమ్మలేకపోయానని చెప్పింది. అసలు స్కూల్స్ ఎప్పుడు ప్రారంభిస్తారని తెలుసుకోవడానికి ఆ విద్యార్థిని లేఖ రాసింది. అందులో ఫోన్ నెంబర్ పొందుపర్చడంతో సీఎం తెలుసుకుని ఆమె ఫోన్ చేసి స్కూల్స్ తెరవడంపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎ స్టాలిన్ సంచలన, వినూత్నంగా ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.
Read More : Festive Sales : ఈ కామర్స్ కంపెనీలకు పండుగే పండుగ…వేల కోట్లలో అమ్మకాలు
కరోనా కారణంగా…మూసివేయబడిన స్కూల్స్ తెరవడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో..కర్నాటక సరిహద్దలో ఉన్న హోసూరులో టైటాన్ టౌన్ షిప్ కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో అంటూ ఓ లేఖ రాసింది. ఈమె ఆరో తరగతి చదువుతోంది. ఈ లేఖలో తన ఫోన్ నెంబర్ కూడా పొందుపరిచింది. లేఖ విషయం తెలుసుకున్న సీఎ స్టాలిన్ ప్రజ్ఞాకు ఫోన్ చేశారు.
Read More : Weather : జాగ్రత్త, రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
నవంబర్ 01 నుంచి పాఠశాలలను తెరువనున్నట్లు చెప్పారు. పాఠశాలలకు వెళ్లే సమయంలో…టీచర్ నిబంధనలు, సూచనలు పాటించాలని సూచించారు. మాస్క్ ధరించండి..సామాజిక దూరం పాటించాలని చెప్పారు. సీఎం తనతో ఫోన్ లో మాట్లాడటాన్ని నమ్మక లేకపోయానని ప్రజ్ఞా వెల్లడించింది.