CM MK Stalin's Wife Durga Uses Deity's Umbrella
CM MK Stalin Wife Uses Deity’s Umbrella : చెన్నైలోని త్యాగరాజస్వామి ఆలయ సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది. వర్షం కురుస్తున్నా త్యాగరాజస్వామి ఊరేగింపుని కొనసాగించారు ఆలయ నిర్వాహకులు. ఇదికాదు అసలైన వివాదం..ఈ ఊరేగింపులో సీఎం స్టాలిన్ భార్య దర్గా స్టాలిన్ పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు సమయంలో వర్షం కురిసింది. దీంతో ఆలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. త్యాగరాజస్వామి ఉత్సవ ఊరేగింపులో దేవుడికి పట్టాల్సిన ఛత్రాన్ని (గొడుగు)ని సీఎం స్టాలిన్ భార్య దర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఆమెకు పట్టారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ మండిపడుతోంది. విమర్శలు సంధిస్తోంది. దేవుడికి పట్టాల్సిన ఛత్రాన్ని సీఎం భార్యకు పడతారా? అంటూ విమర్శిస్తున్నారు.
కానీ ఈ ఘటనలో సీఎం స్టాలిన్ భార్య దర్గా ప్రమేయం ఏమీలేదని వీడియో చూస్తే తెలుస్తుంది.కేవలం ఆలయ సిబ్బంది అత్యుత్సాహమే కనిపిస్తోంది. మరి సీఎంగారి సతీమణి కావటంతో ఆలయ సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈక్రమంలో దుర్గా సిబ్బంది వెంటనే ఓ గొడుగు తెరిచి ఆమెకు పట్టారు. ఆలయంలోంచి స్వామివారి ఉత్సవమూర్తి బయటకు వస్తున్న సమయంలో స్టాలిన్ సతీమణి దుర్గ ఉత్సవమూర్తి వెనుకాలే నడిచారు.
అదే సమయంలో వర్షం పడుతుంటే ఆలయ సిబ్బంది ఉత్సవ మూర్తికి పట్టాల్సి ఛత్రాన్ని పట్టుకుని వడివడిగా ముందుకొచ్చి దర్గాకు పట్టారు. ఇంతలోనే ఆమె సిబ్బంది వెంటనే ఓ సాధారణ గొడుగుతో ముందుకు అడుగులు వేసి ఆమెకు పట్టారు. దీంతో ఈ వీడియోలో ఏమాత్రం సీఎం స్టాలిన్ భార్య ప్రమేయం లేనట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు డీఎంకే నేతలతో పాటు బీజేపీ నేతలు దేవుడికి పట్టాల్సిన ఛత్రాన్ని సీఎం భార్యకు పడతారా? అంటూ మండిపడుతున్నారు.