వీడెవడో మీర్ పేట్ గురుమూర్తి శిష్యుడిలా ఉన్నాడే.. తండ్రీకూతుళ్లను చంపేసి.. వాసన రాకుండా

సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారో, సొంతంగా తమ తెలివివాడుతున్నారో కానీ, ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.

Doctor

హత్య చేసి.. వాసనరాకుండా రసాయనాలు చల్లి, విలన్లు తప్పించుకుపారిపోయే సీన్లను సినిమాల్లో చూస్తుంటాం. ఇటువంటి క్రైమ్‌ థిల్లర్‌ సినిమాలు బాగానే వస్తున్నాయి. నిజజీవితంలోనూ ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి.

వైద్యం కోసం వచ్చిన తండ్రీకూతుళ్లను చంపేశాడు ఓ డాక్టర్‌. వాసనరాకుండా రసాయనాలు చల్లి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. మూడు నెలల పాటు తప్పించుకు తిరిగి చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

ఈ ఘటన తమిళనాడులోని తిరుముల్లైవాయిల్లో చోటుచేసుకుంది. శంకర్ అనే వృద్ధుడు, ఆయన కుమార్తె సింథియా (35) నాలుగు నెలల క్రితం తిరుముల్లైవాయిల్లో ఓ ఇంటిని రెంటుకు తీసుకుని అందులో ఉంటున్నారు.

శంకర్‌ కొంత కాలంగా మూత్రాశయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో సామవేల్‌ అనే డాక్టర్‌ను సింథియా తమ ఇంటికి పిలిపించి తన తండ్రిని చూయించింది. మూడు నెలల క్రితం శంకర్‌కు సామవేల్‌ డయాలసిస్ చేస్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

సామవేల్ చేసిన చికిత్స వల్లే తన తండ్రి మృతిచెందాడని సింథియా గొడవ చేసింది. దీంతో సామవేల్‌, సింథియా ఘర్షణకు దిగారు. సింథియా కిందపడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమై మృతి చెందింది.

సామవేల్ ఆ తండ్రీకూతుళ్ల మృతదేహాలను ఆ ఇంట్లోనే ఉంచే ఉంచేశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, వారు చనిపోయారన్న విషయం తెలియనివ్వకుండా దుర్వాసన రాకుండా కొన్ని రసాయనాలను చల్లాడు.

అనంతరం ఆ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 3 నెలల నుంచి శంకర్‌, సింథియా కనపడకపోవడంతో దీనిపై వారి బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంకర్, సింథియా నివసించిన ఇంటి తలుపులను నిన్న పోలీసులు పగులగొట్టారు.

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. సింథియా కాల్‌ రికార్డులను పరిశీలించి డాక్టర్ సామవేల్‌ను ఓ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు.