Tamil Nadu : ఇంటర్ పరీక్షలు రద్దు

కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంది.

Tamil Nadu Cancels Class 12 Exams : కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో…ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యావేత్తలు, నిపుణులుతో మూడు రోజులుగా సంప్రదింపులు జరిపినట్లు, చివరకు ఈ సంవత్సరం ఇంటర్ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్టాలిన్ వెల్లడించారు.

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, మార్కులు కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…స్కోర్ ఆధారంగానే..ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో..నీట్..అన్ని జాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని ఈ సందర్భంగా..సీఎం స్టాలిన్..కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read More : Tirumala Heavy Rain : తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇక్కట్లు!

ట్రెండింగ్ వార్తలు