జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి : కోవిడ్-19 నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి!

Tamil Nadu government permits Jallikattu : తమిళనాడు జల్లికట్టు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆట.. ప్రతి ఏడాది వందలాది మంది జల్లికట్టు పోటీల్లో పాల్గొంటారు. ఈ ఏడాది అంతా కోవిడ్-19 మహమ్మారితోనే గడిసిపోయింది. ఇప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళులు జరుపుకునే సంప్రదాయ పండుగ జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం.

దీనికి సంబంధించి అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది. 50శాతం మంది మాత్రమే జల్లికట్టులో పాల్గొనేందుకు అనుమతి ఉందని పేర్కొంది. అంతేకాదు.. జల్లికట్టులో పాల్గొనే వారంతా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే జల్లికట్టులో పాల్గొనేందుకు అధికారులు అనుమతించనున్నారు. మరోవైపు..జనవరి 15 నుండి 17 వరకు తమిళనాట జల్లికట్టు పోటీలు జరుగనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జల్లికట్టు పోటీలను నిర్వహించాలని తీర్మానం చేశారు.

కరోనా నిబంధనలు సడలించి జల్లికట్టు పోటీలకు అనుమతివ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. జనవరి 15 నుండి ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారం.. జల్లికట్టు పోటీలను నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కరోనా సమయంలో జల్లికట్టు పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోటీలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించింది.