Tamil Nadu: ప్రజలకు ఉచితంగా ఆరోగ్య, వైద్య సేవలు..‘రైట్ టు హెల్త్’ బిల్ కోసం సీఎం యత్నాలు

‘ఆరోగ్య హక్కు’ను ప్రజలకు ఇచ్చే దిశగా తమిళనాడు సీఎం స్టాలిన్ సర్కారు అడుగులు వేస్తోంది. దీని కోసం ‘రైట్ టు హెల్త్’ బిల్లును రూపొందిస్తోంది.

Tamil Nadu govt drafting Right to Health Bill : సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి స్టాలిన్ తన మార్కు పాలనతో ప్రజలకు ఆకట్టుకుంటున్నారు. అత్యంత సాదా సీదాగా ఉండే స్టాలిన్ ప్రజాశ్రేయస్సు కోసం పాలన అందించటానికి  నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగానే ప్రజలకు మరో గుడ్ చెప్పనున్నారు సీఎం స్టాలిన్. అదేమంటే ప్రతీ ఒక్కరికి అవరసరమయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించాలనుకుంటున్నారు. దీని కోసం పాశ్చాత్య దేశాల్లో అవలంభించే విధానాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదే ‘రైట్ టు హెల్త్’ (Right to Health)‘ఆరోగ్య హక్కు’ను ప్రజలకు ఇచ్చే దిశగా స్టాలిన్ సర్కారు అడుగులు వేస్తోంది. దీని కోసం ‘రైట్ టు హెల్త్’ బిల్లును రూపొందిస్తోంది.

అందరికీ సార్వత్రిక హెల్త్ కవరేజీని ఆఫర్ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా సీఎం స్టాలిన్ ఈ బిల్లు గురించి నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ‘ఆరోగ్య హక్కు’ బిల్లును రూపొందిస్తున్నామని ఆరోగ్య కార్యదర్శి జి. రాధాకృష్ణన్ బుధవారం (మార్చి 16,2022) వెల్లడించారు. ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ , ప్రజారోగ్యం నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం గత వారం ఒక సమావేశం కూడా నిర్వహించారు.

అన్ని వయసుల వారు, అనారోగ్య సమస్యలున్నవారు, మానసిక వైకల్య బాధితులకూ ఈ బిల్లు కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నామని ఇది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించటంలో ఇది చిన్న అడుగే అయినా తమిళనాడు ముందుంటుందని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ తెలిపారు. ఈ బిల్లు ప్రజలు అందరి ఆకాంక్షలకు తగ్గట్టు ఉంటుందని తెలిపారు. “ఈ బిల్లు ద్వారా మా ఆరోగ్య సంరక్షణలో భిన్నమైన వ్యవస్థలను ఒకచోట చేర్చి..దానిని వ్యవస్థీకృతం చేయడమే మా లక్ష్యం” అని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారి ఒకరు తెలిపారు.

ఈ బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల నాటికి తీసుకువచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం. కానీ ఈ బిల్లు అమలు అంత సులభం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ‘‘రైట్ టు హెల్త్ 79 దేశాల్లో ఉంది. ఆయా దేశాల్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలని అన్నారు. అరుదైన వ్యాధుల విషయంలో ఎలా వ్యవహరించాలి? రైటు టు హెల్త్ అమలుకు సిబ్బంది అవసరం ఏ మేరకు అవసరం? అనేవి చూడాలి అని అన్నారు.

1990 నుంచి థాయిలాండ్ లో ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కేర్ అందిస్తుండగా, అటువంటి మోడల్ ను తమిళనాడులోనూ అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ హక్కు అమలుకు ముందుగా తగినన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

తమిళనాడులో ఆశా వర్కర్లు లేకపోయినా, ఆరోగ్య పని కాంట్రాక్ట్‌పై ఉన్న మహిళా ఆరోగ్య వాలంటీర్లు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, కార్యకర్తలు మరియు సిబ్బందిపై ఈ ఆరోగ్య హక్కు విధానం ఆధారపడి ఉంటుంది.ప్రయివేటు ఆసుపత్రులు ఇంకా ఈ ప్రక్రియలో పాలుపంచుకోలేదని..బీమా వంటి అంశాలపై తరువాత సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వ డేటా ప్రకారం..ప్రతి 253 మందికి ఒక డాక్టర్ తో తో విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలలో తమిళనాడు అగ్రగామిగా ఉంది. ఈ నిష్పత్తి ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే మెరుగైనదిగా ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు