Tamil Nadu CM Stalin Govt CBI
Tamil Nadu CM Stalin Govt CBI : ఇటీవల కాలంలో సీబీఐ (CBI) సోదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu DMK govt) కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి జనరల్ కన్సెంట్ (general consent )ను ఉపసంహరించుకుంది. ఇక నుండి తమిళనాడు ( Tamil Nadu)రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాఫ్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ(Electricity Minister V. Senthilbalaji )ని ఈడీ (Enforcement Directorate)అరెస్ట్ చేసిన క్రమంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) ఇచ్చిన సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా స్టాలిన్ (cm stalin)ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టాలి అంటే దానికి తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt)నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Early Lok Sabha Polls: ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
కాగా గతంలో పలు రాష్ట్రాలు ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నాయి. మిజోరాం (Mizoram),పశ్చి బెంగాల్ (West Benga), ఛత్తీస్ గఢ్ (Chhattisgarh),రాజస్థాన్(Rajasthan),మహారాష్ట్ర(Maharashtra), కేరళ( Kerala), జార్ఖండ్ (Jharkhand), పంజాబ్ ( Punjab),మేఘాలయ (Meghalaya), తెలంగాణ (Telangana) ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Minister Jitendra Singh) పార్లమెంట్ (Parliament) కు వెల్లడించారు. పాటు తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు తమిళనాడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవటంతో ఈ లిస్టులో స్టాలిన్ ప్రభుత్వం కూడా చేరింది.
కాగా తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అస్వస్థకు గురి కావటంతో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. మంత్రి అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవటం గమనించాల్సిన విషయం.