Chidambaram Temple: మరోసారి వివాదంలోకి చిదంబరం నటరాజస్వామి ఆలయ ఆస్తులు

దంబర నటరాజస్వామి ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల నిర్వహణను నియంత్రిస్తున్న తమిళనాడు హిందూ మత..ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌ అండ్‌ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది.

Chidambaram Temple: చిదంబర నటరాజస్వామి ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల నిర్వహణను నియంత్రిస్తున్న తమిళనాడు హిందూ మత..ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌ అండ్‌ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది. దేవాలయానికి చెందిన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు వర్గానికి తమిళనాడు రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ (HR And CE) ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు చిదంబరం నటరాజ ఆలయానికి సంబంధించిన ఖాతాల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది. ఆలయ ఆస్తులువివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలయంలోని కనగసభలో దర్శనం పునఃప్రారంభించాలంటూ హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై దీక్షితులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మే 26న హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ కడలూరు జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌, విచారణ కమిటీ సమన్వయకర్త సి.జోతి నోటీసు జారీ చేశారు. నటరాజస్వామి ఆలయ ఆస్తుల వివరాలు, ఆదాయం, ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం తప్పుపడుతున్నాయి. నటరాజస్వామి ఆలయ సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ తేల్చి చెప్పారు. 2014 సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆలయానికి సంబంధించిన పూర్తి హక్కులు దీక్షితులవేనని చెబుతున్నారు.

దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఖండిస్తూ ఆలయ దీక్షితులు రాష్ట్రపతి, ప్రధానికి, రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. నటరాజస్వామీ ఆలయం విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోవటం తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు దీక్షితులు.ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎలాంటి పోరాటానీకైనా తాము రెడీగా ఉన్నామని దీక్షితుల వర్గం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం ఇచ్చే నోటీసులకు ఏమాత్రం భయపడేది లేదని తేల్చి చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు