Tamil Nadu Omicron : తమిళనాడులో న్యూ ఇయర్ వేడుకలపై కొత్త ఆంక్షలు..

దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత

Tamil Nadu Omicron : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. ఈ మేరకు తమిళనాడు డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, క్లబులు, పబ్‌లలో కొత్త ఏడాది వేడుకులను అనుమతించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో మెరీనా బీచ్, ఎల్లియాట్స్ బీచ్, నీలంకారీ, ఈస్ట్ కోస్ట్ రోడ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు ఎవరూ గుంపుగా తిరగరాదని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తమిళనాడులో కొత్త మార్గదర్శకాల్లో.. అన్ని హోటళ్లు తప్పనిసరిగా ప్రస్తుత SOPని అనుసరించాలి.. రాత్రి 11 గంటలలోపు కార్యకలాపాలను ముగించాలి. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రైవేట్ పార్టీలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయి. కుటుంబ సమేతంగా ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని మతపరమైన ప్రార్థనా స్థలాలు కోవిడ్-19కి సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.

సుదూర ప్రయాణీకులందరూ బస్సు లేదా రైలులో ప్రయాణించాలి. బైకులతో రోడ్లపై రాకూడదు. అంతేకాదు.. ప్రమాదాలను నివారించేందుకు ప్రయాణికులు ప్రతి మూడు గంటలకు విరామం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది. నగరంలో చెన్నై పోలీసులు కొత్త ఆంక్షలు ప్రకటించిన తర్వాత ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. తమిళనాడులో SARS-CoV-2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 619 కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 45కి పెరిగింది. కోవిడ్ సోకిన వారిలో ఎక్కువ మంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే ఉన్నారు.  ఈ కమ్రంలోనే తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read Also : CM Nitish kumar : బీహార్ లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది : సీఎం నితీశ్ కుమార్  

ట్రెండింగ్ వార్తలు