Minister Senthil Balaji : ఈడీ అరెస్టుతో భోరున ఏడ్చిన తమిళనాడు మంత్రి ..

చెన్నై హైడ్రామా నెలకొంది. మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మంత్రి భోరున ఏడ్చారు. మంత్రి పెద్దగా ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TamilNadu Minister Senthil Balaji

TamilNadu Minister Senthil Balaji : చెన్నై హైడ్రామా నెలకొంది. మనీలాండరింగ్ కేసు (money-laundering case)లో డీఎంకే నేత, తమిళనాడు (TamilNadu ) విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)ని ఈడీ అధికారులు (ED officials)అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేసిన అధికారులు కస్టడీలోకి తీసుకుని భారీ భద్రత మధ్య వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో తను అరెస్ట్ కావటంతో తట్టుకోలేని మంత్రి సెంథిల్ భోరు భోరున ఏడ్చారు. తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయటంతో మానసిక ఒత్తిడికి గురి అయిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. నొప్పితో భోరు భోరున ఏడ్చారు. వాహనంలోంచి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మంత్రి సెంథిల్ పెద్దగా ఏడ్చారు. ఆయన ఏడుస్తుండగానే ఐసీయూకు తరలించారు. చికిత్సనందిస్తున్నారు.

ఈక్రమంలో ఈడీకి వ్యతిరేకంగా డీఎంకే నేతలు, మంత్రులు, కార్యకర్తలు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంత్రి సెంథిల్ అరెస్టుపై స్పందించిన మరో మంత్రి ఉదయనిథి స్టాలిన్ (udhayanidhi)మాట్లాడుతు..చట్టప్రకారం అధికారులకు సహకరిస్తామని తెలిపారు. కానీ కేంద్రం ఇలాంటి అరెస్టులతో మా ప్రభుత్వాన్ని బెదిరించాలనుకుంటేనే మాత్రం భయపడేది లేదని రాజకీయ బెదిరంపులకు బెదరం అని తేల్చి చెప్పారు.

కాగా.. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED officials)తమిళనాడు (TamilNadu) మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ చేసిన తరువాత అరెస్ట్ చేశారు. సెక్రటేరియట్‌లోని సెంథిల్‌బాలాజీ అధికారిక ఛాంబర్‌లో, చెన్నైలోని ఆయన నివాసంతో పాటు కరూర్, కోయంబత్తూరులోని ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED officials) సోదాలు నిర్వహించారు. మంత్రి సెంథిల్‌బాలాజీని అరెస్టు చేసి..వైద్యపరీక్షల కోసం చెన్నైలోని ప్రభుత్వ  హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో చేర్చారు.  వాహనంలోంచి ఆస్పత్రిలోకి తరలిస్తుండగా మంత్రి భోరున ఏడ్వటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TamilNadu Minister Arrest :మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాడులు..తమిళనాడు మంత్రి అరెస్ట్

ఈడీ విచారణ సమయంలో మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఛాతీ నొప్పితో బాధపడ్డారని డీఎంకే నేతలు తెలిపారు. ప్రస్తుతం సెంథిల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆయన్ని పరామర్శించటానికి మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఆస్పత్రికి వచ్చారు. మంత్రి సెంథిల్ కు చికిత్స కొనసాగుతోందని ఉదయనిథి స్టాలిన్ తెలిపారు.

కాగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్న సెంథిల్‌ (Senthil Balaji).. దివంగత జయలలిత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రవాణా శాఖలోని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమాలు జరిగాలయనే ఆరోపణలతో ఈడీ (Enforcement Directorate) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈడీ మరోసారి సెంథిల్ ను విచారించేందుకు వచ్చింది.

కేంద్ర పారామిలటరీ బలగాల భద్రత మధ్య సెంథిల్‌ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌కు చెందిన చెన్నై, కరూర్‌ లలోని నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు,పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు