Tamilnadu : 65గంటలు కష్టపడి వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చిన అధికారులు

65గంటలు కష్టపడి వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చారు అటవీశాఖ అధికారులు.

tamilnadu :  ఓ ఏనుగు పిల్లను వాళ్ల అమ్మ వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు 65 గంటలు కష్టపడ్డారు. వారి కష్టం ఫలించింది. పిల్ల ఏనుగుని అమ్మవద్దకు చేర్చారు. తల్లి ఏనుగును చూసిన పిల్ల ఏనుగు ఎంతో సంబరపడిపోయింది. బిడ్డను చూసిన ఆనందంలో ఆ తల్లి ఏనుగు సంతోషం కూడా అంతా ఇంతా కాదు. ఆ ఏనుగుల ఆనందం చూసిన అటవీశాఖ అధికారుల ఆనందంతో పొంగిపోయారు. తల్లీ బిడ్డలను కలిపిన ఆనందంతో వారు తిరిగి వారి డ్యూటీలో నిమగ్నమైపోయారు. ఇదంతా తమిళనాడులో జరిగింది. వరదనీటిలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను కాపాడి 65 గంటలు కష్టపడి తల్లి ఏనుగును వెతికి మరీ పిల్లఏనుగుని తల్లికి అప్పగించారు.

తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి చెందిన అటవీ అధికారులు వరదనీటిలో కొట్టుకొచ్చిన ఏనుగుపిల్లన కాపాడారు. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏనుగు పిల్ల వరదనీటిలో కొట్టుకొచ్చింది. దానిని గమనించిన అధికారులు రక్షించి.. తన తల్లి దగ్గరకు ఎలాగైనా చేర్చాలని నిర్ణయించారు. అందుకోసం ఎనిమిది బృందాలుగా విడిపోయి మసినగుడి, సింగర అటవీ ప్రాంతాల్లో తల్లి ఏనుగు కోసం వెతికారు. ఎక్కడా దాని జాడ కనిపించలేదు. చివరకు సిగూరు అటవీ ప్రాంతంలో తల్లి ఏనుగును అధికారులు గుర్తించారు. వెంటనే ఏనుగు పిల్లను తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. దీంతో అధికారులంతా ఆనందంలో మునిగితేలారు.

 

ట్రెండింగ్ వార్తలు