బస్సులో వెళ్తున్న అమ్మాయికి తాళి కట్టేశాడు: చితక్కొట్టి లోపలేశారు

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 06:18 AM IST
బస్సులో వెళ్తున్న అమ్మాయికి తాళి కట్టేశాడు: చితక్కొట్టి లోపలేశారు

Updated On : December 11, 2019 / 6:18 AM IST

తన ప్రేమను అంగీకరించలేదనీ..మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశారు ఓ యువకుడు.  బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన సదరు యువకుడు  ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్రోర్‌కుప్పంలో జరిగింది. 

కుప్పానికి చెందిన జగన్ అనే 27 యువడకుడు కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కానీ నాకు ఇష్టం లేదని ఆమె చెప్పేది. కానీ పదే పదే ప్రేమ ప్రేమ అంటూ ఆమె వెంట పడేవాడు. కానీ ఆమె..నిన్నో ఫ్రెండ్ గా చూశాను తప్ప ఎప్పుడూ ప్రేమించలేదని దయచేసి అర్థం చేసుకోమని చెప్పింది. కానీ నన్ను ప్రేమించాల్సిందేనని పట్టుపడేవాడు. అప్పటి నుంచి జగన్ ను పట్టించుకోవటం మావనేసింది ఆమె.కానీ జగన్ మాత్రం ఆమెను వదల్లేదు.  మన ఇద్దరి కులాలు వేరు మా ఇంట్లో ఒప్పుకోరు అంటూ జగన్ ను తిరస్కరించిందామె.

ఈ క్రమంలో ఆమెకు మరో యువకుడితో పెళ్లి కుదిరింది. పెద్ద సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. విషయం తెలుసుకున్న జగన్‌..ఆమెను ఫాలో అయ్యాడు. మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం ఆంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతున్న సదరు యువతి ఎక్కిన బస్సులో ఎక్కాడు. అలా ఎక్కిన జగన్ ఆమె కూర్చున్న వెనుక సీట్లో కూర్చున్నాడు. అదను చూసి జేబులో నుంచి తాళి తీసి వెనుక నుంచి యువతి మెడలో  బలవంతంగా తాళి కట్టేశాడు.

దీంతో ఆమె కేకలు వేసింది. యువతి కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు జగన్ ను పట్టుకున్నారు. చితకబాదారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వాణియంబాడి పోలీసులు వెంటనే వచ్చిన జగన్‌ ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. తరువాత కేసు నమోదు చేసి..సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.