అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 10:00 AM IST
అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు

Updated On : February 26, 2019 / 10:00 AM IST

మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో భారత్-పాక్ ల మధ్య ఉన్న ఎల్ వోసీ దాటి బాల్కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో  ముఖ్యంగా కొందరిని భారత్ టార్గెట్ చేసింది. భారత్ టార్గెట్ చేసినవారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ బావమరిది అజర్ యూసఫ్ అలియాస్ మొహమ్మద్ సలీమ్ ఒకరు.
Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

1999లో ఖాఠ్మండూ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన IC-814 విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లిన హైజాకర్లలో అజర్ యూసఫ్ కూడా ఒకడు.పాక్ లోని కరాచీకి చెందిన  అజర్ పై భారత్ 2000 సంవత్సరంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం భారత  వాయుసేన దాడుల్లో అజర్ చనిపోయాడు.

బాల్కోట్ లో అజర్ నేతృత్వంలో ఉన్న టెర్రర్ క్యాంప్ ని మిరాజ్ యుద్ధ విమానాలు నామారూపాల్లేకుండా చేశాయి. పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు చనిపోయారని,చనిపోయినవారిలో జైషే కి చెందిన టాప్ కమాండర్లు ఉన్నారని,,ట్రైనీలు, సూసైడ్ బాంబర్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్నవారిని అంతమొందించినట్లు  IAF దాడుల తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.
Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది