Viral Video : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీషు పాఠాలు చెప్పబోతున్న ఈ బామ్మ ఎవరో తెలుసా?

బర్మాలో పుట్టింది.. పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయ్యింది. అందర్నీ కోల్పోయి 81 సంవత్సరాల వయసులో ఒంటరిదైంది. ఆ బామ్మకు ఆసరా కల్పించిన కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీషు పాఠాలు చెప్పించబోతున్నారు. ఆ బామ్మ కన్నీటి కథనం చదవండి.

Viral Video

Viral Video : సోషల్ మీడియాలో రోజు అనేక వీడియోలు పోస్టు అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆసక్తికరమైన కథల్ని చెబుతాయి. కొందరి జీవితాలు ఎక్కడ మొదలై.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూస్తే మనసు చలించిపోతుంది. బర్మాలో పుట్టి అక్కడ ఇంగ్లీషు టీచర్‌గా పనిచేసి పెళ్లాడిన వ్యక్తి కోసం ఇండియా వచ్చిన ఓ బామ్మ జీవిత చరమాంకం తెలిస్తే కన్నీరు వస్తుంది. ఆమె పరిస్థితి చూసిన కొందరు కుర్రాళ్లు ఆమెకు అందించిన సాయం కొంత ఊరటను కలిగిస్తోంది. ఆసక్తి కలిగించే మెర్లిన్ జీవిత కథనం చదవండి.

Viral Video: రైలు ఫుట్ బోర్డులో వేలాడుతూ భయంకర జర్నీ చేసిన బామ్మ.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

బర్మాకు చెందిన 81 సంవత్సరాల మెర్లిన్ ఒకప్పుడు ఇంగ్లీష్ టీచర్. పెళ్లయ్యాక భర్తతో పాటు ఇండియాకు వచ్చేసింది. ప్రస్తుతం అందరినీ కోల్పోయి ఒంటరిదైంది. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక మద్రాస్ అడయార్‌లో రోడ్డుపైనే జీవిస్తోంది. మహ్మద్ ఆషిక్ (Mohamed Ashik) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రోడ్డుపై ఉన్న ఈ బామ్మని తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేసాడు. పొట్ట కూటి కోసం భిక్షాటన చేస్తున్నానని, బర్మాలో ఉన్నప్పుడు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్‌గా పనిచేసానని మెర్లిన్ వీడియోలో చెప్పింది. మహ్మద్ ఆషిక్ ఆమెకు చీరను బహుమతిగా ఇవ్వడంతో ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. భగవంతుడు తనకు ఇచ్చింది ఏదైనా ఇష్టమేనని చెప్పింది.

US Mud Run : మడ్ రేసులో పరుగులు తీసిన 84 ఏళ్ల బామ్మగారు.. వయసు జస్ట్ నంబర్ మాత్రమే..

ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన మహ్మద్ ఆషిక్ ఒకప్పుడు టీచర్‌గా ఉన్న  ఆ బామ్మని భిక్షాటన చేయడం మానుకోమని.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉండమని రిక్వెస్ట్ చేసాడు. వీడియోల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం ఇస్తానని చెప్పాడు. ఆమెకు నచ్చచెప్పి కొందరి సాయంతో వృద్ధాశ్రమంలో చేర్చారు. ఇప్పుడు మెర్లిన్‌కి ఆశ్రయంతో పాటు ఆహారం, ఎంతో ప్రేమ దొరికాయి. ఇకపై మెర్లిన్ బామ్మ చెప్పే ఇంగ్లీషు పాఠాలు నేర్చుకోవాలంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను (@englishwithmerlin) ఫాలో అవ్వాలన్నమాట. బర్మా నుంచి ఇండియా వచ్చిన మెర్లిన్ కన్నీటి గాథ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. మెర్లిన్‌పై తీసిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.