Pakistani national
Pakistani National : పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నగరానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న ఈ వ్యక్తి ఆమెను కలవడానికి నేపాల్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
ముందుగా పాక్ నుంచి బయల్దేరిన వ్యక్తి.. నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. ఈ పాకిస్తానీ పేరు మహమ్మద్ ఫయాజ్గా పోలీసులు గుర్తించి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఈ పాక్ యువకుడు ఫయాజ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లుగా గుర్తించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీ పౌరులున్నారని స్పెషల్ బ్రాంచ్ గుర్తించింది.
పహెల్గాం ఉగ్రదాడితో దేశంపై భారత్ అనేక ఆంక్షలు విధించింది. పాకిస్తానీలకు సంబంధించిన వీసాలను సైతం రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసినట్టుగా విదేశాంగ శాఖ ప్రకటించింది.
Read Also : Oppo A5 Pro vs Vivo T4 : వివో కావాలా? ఒప్పో కావాలా? ఈ రెండు 5G ఫోన్లలో ఏది కొంటే బెటర్? మీదే ఛాయిస్..!
ఇప్పటివరకూ జారీ చేసిన మెడికల్ వీసాలు ఏప్రిల్ 29వ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ నగరంలో మొత్తంగా 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 156 మంది వరకు లాంగ్ టర్మ్ వీసా, 13మంది షార్ట్ టర్మ్ వీసా, 39 మందికి బిజినెస్ వీసా ఉందని గుర్తించారు.