Mobile Recharge Plans : ఇకపై 28 రోజులు కాదు.. 30 రోజులు, మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ పెంచాలని ట్రాయ్ ఆదేశం

గతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30రోజుల కాలపరిమితితో లభించేవి. ఆ తర్వాత వీటిని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి. దీంతో సంవత్సరానికి 13సార్లు రీచార్జ్ చేసుకోవాల్సివస్తోంది.

TRAI mandates telcos mobile recharge : భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) టెలికాం సంస్థకు షాక్ ఇచ్చింది. మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ప్యాక్ ల విషయంలో వ్యాలిడిటీని పెంచాల్సిందేనని టెలికాం సంస్థలకు తేల్చి చెప్పింది. ఇకపై ప్రతి సంస్థ 28 రోజులకు కాకుండా 30 రోజుల కాల పరిమితితో రీఛార్జ్ ప్యాక్ లను తీసుకురావాలని ఆదేశించింది.

గతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభించేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి. దాని ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది యూజర్లకు భారంగా మారుతోంది. ఈ క్రమంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌‌లను తీసుకురావాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.

Educational Institutions : తెలంగాణలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం..!

ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్‌-1999కి మార్పులు చేస్తూ ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని ట్రాయ్ తెలిపింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా రెండు నెలల్లోపు ఆదేశాలను అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు