భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోగా.. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత పొరుగు దేశం చైనా మరోసారి తన వంకర బుద్ధిని చూపిస్తుంది. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే కయ్యానికి కాలు దువ్వుతోంది.
పాంగోగ్ సరస్సు సమీపంలో ఉన్న ఫింగర్ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడటానికి ప్రయత్నించారు. చైనా చొరబాట్లకు భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. ఈ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ మరణించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
https://10tv.in/india-china-clash-at-pangong-lake/
చైనా విదేశాంగ మంత్రి ప్రకటన:
చైనా ప్రభుత్వ మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రి ఎల్‌ఐసి (లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్)ను దాటలేదని చెప్పారు. ఈ విధంగా, మరోసారి తన ప్రకటనలో చైనా చర్యలను గురించి దాచడానికి ప్రయత్నించారు.
చైనా చొరబాటుపై కాంగ్రెస్ మరోసారి ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుంది. భారత సార్వభౌమాధికారం ప్రతిరోజూ దాడికి గురవుతోందని, మన భూమిని ఆక్రమించే ధైర్యం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ ద్వారా పిఎం మోడిని విమర్శించారు. దేశంలో చైనా చొరబాట్లు జరుగుతున్నా కూడా మోడీజీ “ఎర్రటి కన్ను” ఎక్కడ ఉంది. మీరు ఎప్పుడు చైనాతో మాట్లాడతారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.