Gujarat
Gujarat : సింహం ఆవు మెడ కరిచి పట్టుకుని వదలట్లేదు. ఆవు పట్టు తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సింహం వదలట్లేదు. అటుగా వెడుతున్న ఓ రైతు ఈ దృశ్యాన్ని చూసాడు. ఆవుని ధైర్యంగా కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Guinness World Records : నిముషంలో 10 ట్రిక్స్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆవు
@VivekKotdiya అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ భారీ సింహం ఆవు మెడను కొరికేస్తున్నట్లు చూపిస్తుంది. ఆవు దాని నుంచి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. అయినా సింహం పట్టు వదల్లేదు. అంతలో అటువైపుగా వెడుతున్న ఓ రైతు వాటికి కొంచెం దగ్గరగా వచ్చాడు. ధైర్యంగా సింహాన్ని అదిలించాడు. కర్ర, రాయి కోసం వెతికాడు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రాయి తీసుకుని సింహాన్ని భయపెట్టాడు. ఈ వీడియోను కారులో ఉండి ఒకరు చిత్రించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ‘గిరి సోమనాథ్ జిల్లాలోని అలీదర్ గ్రామంలో ఒక ఆవుపై సింహం దాడి చేసినపుడు రైతు కిరీతిన్ష్ చౌహాన్ ఆవును కాపాడి ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చాలా ధన్యవాదాలు’ అనే శీర్షికను యాడ్ చేశారు.
Karnataka Politics: ఆవుల్ని వధిస్తే తప్పేంటన్న కర్ణాటక మంత్రి.. సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ ఏంటంటే?
వీడియోపై నెటిజన్లు సైతం స్పందించారు. ‘రైతు ఆవుని సింహం నుంచి ధైర్యంగా రక్షించడం చాలా గొప్ప విషయం.. అయితే ఈ వీడియోను చిత్రిస్తున్న వ్యక్తి రైతుకు ఎందుకు సాయం చేయలేదో నాకు అర్ధం కాలేదు’ అని ఒకరు.. ‘అతను నిజమైన హీరో మరియు ధైర్యవంతుడు’ అని మరొకరు వరుసగా స్పందించారు. ఇదంతా వీడియో షూట్ చేస్తున్న వ్యక్తి రైతుకి ఎందుకు సాయం చేయలేదని చాలామంది అభిప్రాయపడ్డారు.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ— Vivek Kotadiya?? BJP (@VivekKotdiya) June 29, 2023